వారిస్ పంజాబ్ దే అమృత్‌పాల్ సింగ్ అరెస్ట్..!!
వారిస్ పంజాబ్ దే నేత..ఖలిస్తానీ సానుభూతి పరుడు అమృత్‌పాల్ సింగ్ అరెస్ట్ అయ్యాడు. పంజాబ్ లోని మోగా పోలీసులు అమృత్‌పాల్ సింగ్ ను అరెస్ట్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అస్సాంలోని దిబ్రుగుర్హ కు తరలించినట్లు తెలుస్తోంది. మార్చి నెల నుంచి అమృత్‌పాల్ సింగ్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మార్చి 18వ తేదీ నుంచి తప్పించుకొని తిరుగుతున్న అమృత్‌పాల్ సింగ్ ను ఎట్టకేలకు పట్టుకున్నట్లు తెలుస్తోంది.
అమృత్‌పాల్ సింగ్ కు అత్యంత సన్నిహితుడుగా లవ్ ప్రీత్ సింగ్ ను అలియాస్ తుఫాన్ సింగ్ ను పోలీసులు ఈ మధ్య కాలంలో ఒక కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేసారు. దీనిని నిరసిస్తూ అమృత్‌పాల్ సింగ్ పిలుపు మేరకు ఫిబ్రవరి 24న పెద్ద సంఖ్యలో యువత అమృత్‌సర్ జిల్లాలోని అజ్ నాల్ పోలీసు స్టేషన్ పైన దాడికి తెగబడ్డారు.

అల్లర్లు జరిగేలా యువతను రెచ్చగొట్టాడని అమృత్‌పాల్ సింగ్ పై కేసు నమోదైంది. అమృత్‌పాల్ సింగ్ ను గతంలోనే పోలీసులు అరెస్ట్ చేసారనే వార్తలు వచ్చినా.. దొరక్కుండా తప్పించుకున్నాడు. మార్చి 18 నుండి అమృతపాల్ సింగ్ పరారీలో ఉన్నాడు. అమృత్‌పాల్ పై నిఘా పెట్టిన విచారణ సంస్థలు ఐసిస్ తోనూ సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించారు.
జలంధర్ జిల్లాలో తన కాన్వాయ్‌ను అడ్డగించిన తర్వాత అమృతపాల్ పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. నాటి నుంచి పోలీసుల కంట పడకుండా అనేక స్థావరాలు మారుస్తూ వచ్చాడు. కొద్ది రోజుల క్రితం అమృత్‌పాల్ సింగ్ భార్యను పంజాబ్ పోలీసులు అమృత్‌సర్ విమానాశ్రయంలో అడ్డుకున్నారు. కిరణ్‌దీప్ కౌర్ బ్రిటన్‌కు పారిపోవడానికి ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి.
#WATCH | Earlier visuals of Waris Punjab De's #AmritpalSingh at Gurudwara in Moga, Punjab.
— ANI (@ANI) April 23, 2023
He was arrested by Punjab Police from Moga this morning and is likely to be shifted to Dibrugarh, Assam. pic.twitter.com/2HMxTr50s7
నటుడు దీప్ సిద్ధూ మరణంతో అతను ప్రారంభించిన "వారిస్ పంజాబ్ దే" అనే రాడికల్ సంస్థకు అమృత్ పాల్ సింగ్ నాయకత్వం వహిస్తున్నాడు. యువతను తన ప్రసంగాలతో రెచ్చొగొట్టి ఉద్రిక్తతలకు దారి తీసేలా వ్యవహిస్తున్నాడు. అమృత్ పాల్ అనుచరులు పలువురిని ఇప్పటికే పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేసారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications