భార్య, మరదలిని ఎక్కడపడితే అక్కడ టచ్ చేశాడని ముక్కలుగా నరికేసి వంట గదిలో !
ముంబాయి: మహారాష్ట్ర రాజధాని ముంబాయిలో 17 ఏళ్ల బాలుడిని హత్య చేసి అతని మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసిన ఆటో డ్రైవర్ అతని పగ తీర్చుకున్నాడు. అరెస్టు అయిన ఆటోడ్రైవర్ భార్య హత్యకు గురైన బాలుడిని సోదరుడిగా భావించిందని తెలిసింది. ఈ ఆరోపణలకు సంబంధించి ముంబాయిలోని ఆర్సీఎఫ్ పోలీసులు బుధవారం చెంబూరులో ఆటో డ్రైవర్ షేక్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు.
మృతుడు తన భార్యపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతోపాటు ఆమె సోదరిని ఎక్కడపడితే అక్కడ తాకడం మొదలుపెట్టాడని, అందుకే అతన్ని హత్య చేశానని ఆటో డ్రైవర్ అంగీకరించాడని పోలీసు అధికారులు అంటున్నారు. బాలుడి మృత దేహాన్ని ముక్కలు ముక్కలుగా కోసి, శరీర భాగాలను వంటగదిలో దాచి పెట్టాడని, తరువాత శరీరంలోని ముక్కలు పారవేసేందుకు ఆటో డ్రైవర్ ప్లాన్ చేశాడని పోలీసులు అంటున్నారు.

అయితే అంతలోనే ఆటో డ్రైవర్ పోలీసులకు చిక్కిపోయాడు. నిందితుడు షఫీక్ అలియాస్ షఫీ షేక్‌ను అరెస్ట్ చేశామని ముంబాయి పోలీసులు తెలిపారు. ఆగస్ట్ 28న బాలుడిని ఆటో డ్రైవర్ షపీక్ షేక్ హతమార్చాడు అని డీసీపీ హేమ్‌రాజ్ సింగ్ రాజ్‌పుత్ తెలిపారు. ఈశ్వర్ మార్వాడీ అనే బాలుడు హత్యకు గురైనాడు. కొడవలితో ఈశ్వర్ ను నరికి చంపిన తర్వాత అతని తలపై ఆటో డ్రైవర్ షేక్ సుత్తితో బాది కసి తీర్చుకున్నాడని డీసీపీ తెలిపారు.
ఈశ్వర్ హత్యకు ఉపయోగించిన కొడవలి, సుత్తిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఆటో డ్రైవర్ షేక్ గతంలో ఉరాన్‌లో నివసించేవాడు. ఇప్పుడు తన భార్యతో కలిసి ఆర్‌సీఎఫ్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. అంతకుముందు 2013లో ఉరాన్‌లో జై నారాయణ్ కోలీని హత్య చేసినందుకు షేక్ అరెస్టు అయ్యాడని, అతనిపై దోపిడీ కేసు కూడా ఉందని, హత్యకేసులో కొన్నాళ్లపాటు జైలుశిక్ష అనుభవించి బెయిల్ మీద విడుదలైన తర్వాత గోవందికి మకాం మార్చాడని పోలీసు అధికారులు తెలిపారు.
2013లో జరిగిన హత్యకేసులో తాను నిర్దోషిగా విడుదలైనట్లు షేక్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం. మరోవైపు మరణించిన బాలుడు ఈశ్వర్ ను కూడా చెంబూర్ పోలీసులు ఇంట్లో చోరీకి ప్రయత్నించిన కేసులో అదుపులోకి తీసుకుని డోంగ్రీ చిల్డ్రన్స్ హోమ్‌కు పంపారని, తరువాత అతను బయటకు వచ్చాడని. ఇప్పుడు అదే బాలుడు హత్యకు గురైనాడని పోలీసులు అంటున్నారు. అయితే ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ముంబాయి పోలీసు అధికారులు తెలిపారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications