జమ్మూ కాశ్మీర్‌లో పెను భూకంపం: ఢిల్లీలో సైతం ప్రకంపనలు
జమ్మూ: జమ్మూ కాశ్మీర్‌లో పెను భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.7గా రికార్డయింది. జమ్మూకు 210 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిష్తవార్‌లో ఈ మధ్యాహ్నం భూమి ప్రకంపించింది. దీని ప్రకంపనలు అటు దేశ రాజధానిపైనా పడ్డాయి. ఢిల్లీ- నేషనల కేపిటల్ రీజియన్ పరిధిలో పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. దీనివల్ల సంభవించిన ఆస్తినష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా అందాల్సి ఉంది.

#WATCH | An earthquake of magnitude 5.4 on the Richter scale hit Doda, J&K at 1:33 pm this afternoon.
— ANI (@ANI) June 13, 2023
A local from Srinagar says, "The earthquake scared school children. People in shops rushed out. It was scary. This was more intense than the tremors last week..." pic.twitter.com/c08L07mz6i
ఈ మధ్యాహ్నం దోడా, కిష్తవార్ జిల్లాలో 5.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ డైరెక్టర్ డాక్టర్ ఓపీ శర్మ తెలిపారు. దీని ప్రకంపనలు హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ- ఎన్సీఆర్, ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లల్లో కనిపించింది. దోడాలో సంభవించిన ప్రధాన భూకంపం తరువాత ఆయా రాష్ట్రాల్లో తేలికపాటి ప్రకంపనలు నమోదయ్యాయి వివరించారు.
Strong Earthquake Tremors !! Who felt it ? pic.twitter.com/KCxAaDe3V5
— Gagandeep Singh (@Gagan4344) June 13, 2023
జమ్మూ కాశ్మీర్‌లో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాలు, దుకాణాల నుంచి జనం రోడ్ల మీదికి పరుగులు పెట్టారు. పాఠశాలల్లో తరగతి గదులను ఉపాధ్యాయులు ఖాళీ చేయించారు. తక్షణమే విద్యార్థులందరినీ బయటికి పంపించారు. ప్రధాన భూకంపం తరువాత కూడా ప్రకంపనలు నమోదయ్యాయి. ఫలితంగా వారంతా ఇళ్లల్లోనికి వెళ్లడానికి భయపడ్డారు. రోడ్ల మీదే కాలం గడుపుతున్నారు.
#earthquake in Chandigarh ! My God pic.twitter.com/JPn0SOmj5k
— Sara Gurpal (@SGurpal) June 13, 2023
దోడా, కిష్తవార్, పంజాబ్‌లోని లూధియానా, రోపర్, జలంధర్, అమృత్‌సర్, సిమ్లా వంటి నగరాల్లో ప్రకంపనలు కనిపించాయి. కొన్ని చోట్ల భవనాలు బీటలు వారాయి. మరి కొన్ని చోట్ల బలహీనంగా ఉన్న భవనాలు నేలమట్టం అయినట్లు తెలుస్తోంది. భూకంప తీవ్రతను పలువురు స్థానికులు తమ మొబైల్ ఫోన్లల్లో చిత్రీకరించారు. వాటి వీడియో క్లిప్పింగ్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోన్నారు. ప్రాణనష్టం సంభవించినట్లు ఇప్పటివరకు ఎలాంటి వార్తలు అందలేదు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications