teacher: స్కూల్ లో, ఇంట్లో ట్యూషన్ చెప్పే టైమ్ లో ఇంగ్లీష్ టీచర్ ఏం చేస్తున్నాడంటే ?, ఇంగ్లీష్ సీన్స్ !
బెంగళూరు/బాగల్ కోటే: స్కూట్ లో టీచర్ గా ఉద్యోగం వచ్చింది. స్కూట్ టీచర్ కు పెళ్లి అయ్యి భార్య ఉంది, స్కూల్ లో పాఠాలు చెబుతున్న టీచర్ ఇంటి దగ్గర ఇంగ్లీష్ ట్కూషన్ చెబుతున్నాడు. ఇంటి దగ్గర ట్యూషన్ కు చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు వెళ్లి వస్తున్నారు. ఇంతకాలం స్కూల్ టీచర్ ఆగడాలు బయటకు రాలేదు. ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు మేము స్కూల్ కు వెళ్లము, ఇంగ్లీష్ ట్యూషన్ కు వెళ్లము అని వాళ్ల కుటుంబ సభ్యులకు తేల్చి చెప్పారు. ఏం జరిగింది అని అమ్మాయిల కుటుంబ సభ్యులు ఆరా తీశారు. స్కూల్ అయిపోయిన తరువాత స్కూల్ లో, ట్యూషన్ కు వెళ్లిన తరువాత భార్య ఇంట్లో లేని సమయంలో ఇంగ్లీష్ టీచర్ ఏం చేశాడు అని ఇద్దరు అమ్మాయిలు పిన్ టూ పిన్ చెప్పడంతో వాళ్ల కుటుంబ సభ్యులు హడలిపోయారు.

టీచర్ ఉద్యోగం వచ్చింది
కర్ణాటకలోని హావేరి జిల్లాకు చెందిన లక్ష్మణ దేవేంద్రప్ప అలియాస్ దేవేంద్రకు భాగల్ కోటే జిల్లాలోని సావలగిలోని ఎయిడెడ్ స్కూలో ఇంగ్లీష్ టీచర్ గా ఉద్యోగం వచ్చింది. స్కూట్ టీచర్ దేవేంద్రకు పెళ్లి అయ్యి భార్య ఉంది, సావలిగిలో 14 సంవత్సరాల నుంచి దేవేంద్ర అతని భార్యతో కలిసి అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నాడు. ఎయిడెడ్ స్కూల్ లో పాఠాలు చెబుతున్న టీచర్ దేవేంద్ర అతని ఇంటి దగ్గర ఉదయం, సాయంత్రం ఇంగ్లీష్ ట్కూషన్ చెబుతున్నాడు.

స్కూల్ అయిపోయిన వెంటనే ?
దేవేంద్ర ఇంటి దగ్గర ట్యూషన్ కు చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు వెళ్లి వస్తున్నారు. స్కూల్ అయిపోయిన తరువాత ఓ అమ్మాయిని మాత్రం నువ్వు ఇక్కడే ఉండాలని చెప్పిన దేవేంద్ర తరువాత ఆమెను ఓ క్లాస్ రూమ్ లోకి తీసుకెళ్లి లైంగిక వేదింపులకు గురి చేశాడని ఆరోపణలు ఉన్నాయి. అమ్మాయి ఇంట్లో విసయం చెప్పకుండా సైలెంట్ గా ఉండిపోయింది. మ్యాటర్ లీక్ కాలేదని అనుకున్న దేవేంద్ర రానురాను అమ్మాయిని లైంగిక వేధింపులకు గురి చేసి చివరికి ఆమె మీద అత్యాచారం చేశాడని ఆరోపణలు ఉన్నాయి.

భార్య ఇంట్లో లేని సమయంలో ?
ఇంటి దగ్గర ట్యూషన్ కు వస్తున్న మరో అమ్మాయి మీద దేవేంద్ర కన్నుపడింది. ట్యూషన్ చెప్పే ముసుగులో అమ్మాయి మీద ఎక్కడపడితే అక్కడ చేతులు వేస్తూ ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశాడని ఆరోపణలు ఉన్నాయి, భార్య ఊరికి వెళ్లిన సమయంలో ట్యూషన్ పూర్తి అయిన తరువాత ఆ అమ్మాయిని ఇంట్లోనే పెట్టుకుంటున్న టీచర్ దేవేంద్ర ఆమె మీద అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు చెబితే మిమ్మల్ని పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని, చంపేస్తానని ఇద్దరు అమ్మాయిలను టీచర్ దేవేంద్ర బెదిరించాడని ఆరోపణలు ఉన్నాయి.

టార్చర్ తట్టుకోలేక అమ్మాయిలు ?
ఇంతకాలం స్కూల్ టీచర్ దేవేంద్ర ఆగడాలు బయటకు రాలేదు. రానురాను టీచర్ దేవేంద్ర టార్చర్ ఎక్కువ కావడంతో అతని వేధింపులు తట్టుకోలేని ఇద్దరు అమ్మాయిలు మేము స్కూల్ కు వెళ్లము, ఇంగ్లీష్ ట్యూషన్ కు వెళ్లము అని వాళ్ల కుటుంబ సభ్యులకు తేల్చి చెప్పారు. ఏం జరిగింది అని అమ్మాయిల కుటుంబ సభ్యులు ఆరా తీశారు. అమ్మాయిలను మెళ్లిగా వాళ్ల కుటుంబ సభ్యులు విచారణ చేశారు.

ఇద్దరిని అత్యాచారం చేసిన కామాంధుడు
స్కూల్ అయిపోయిన తరువాత స్కూల్ లో తనను టీచర్ దేవేంద్ర పదేపదే లైంగిక వేధింపులకు గురి చెయ్యడమే కాకుండా తన మీద అత్యాచారం చేస్తున్నాడని ఓఅమ్మాయి వాళ్ల కుటుంబ సభ్యులకు చెప్పింది, ట్యూషన్ కు వెళ్లిన తరువాత భార్య ఇంట్లో లేని సమయంలో ఇంగ్లీష్ టీచర్ దేవేంద్ర తన మీద అత్యాచారం చేస్తున్నాడని మరో అమ్మాయిలు పిన్ టూ పిన్ చెప్పడంతో వాళ్ల కుటుంబ సభ్యులు హడలిపోయారు. ఇద్దరు అమ్మాయిల కుటుంబ సభ్యులు సావలిగి పోలీస్ స్టేషన్ లో టీచర్ దేవేంద్ర మీద కేసు పెట్టారు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు కామాంధుడైన టీచర్ దేవేంద్రను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications