యువతిపై రేప్ కి విఫలయత్నం.. సీసీటీవీలో రికార్డు..
బెంగళూరులోని కట్రిగుప్పెలో 25 ఏళ్ల యువతిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు ఓ దుండగుడు. తను ఉంటున్న పేయింగ్ గెస్ట్‌హౌస్ దగ్గరలో నిలబడి యువతి ఫోన్ లో మాట్లాడుతుండగా.. వెనుకవైపు నుంచి వచ్చి ఆమెపై ఎటాక్ చేసిన దుండగుడు ఆమెను సమీపంలోని ఓ భవనం వద్దకు తీసుకెళ్లి అత్యాచారం చేసేందుకు యత్నించాడు. ఏప్రిల్ 23వ తేదీ రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన సీసీటీవీలో రికార్డయ్యింది.
దుండగుడు తనపై అత్యాచారానికి యత్నిస్తున్న సమయంలో.. బాధితురాలు గట్టిగా ప్రతిఘటించడంతో అతని ప్రయత్నం విఫలమైంది. దుండగుడి చేతిని గట్టిగా కొరికిన యువతి.. మొత్తానికి అతని బారి నుంచి తప్పించుకుని బయటపడింది. అక్కడి నుంచి నేరుగా తన పేయింగ్ గెస్ట్ హౌజ్ కి వెళ్లిన యువతి తనపై జరిగిన అత్యాచార యత్నాన్ని పీజీ నిర్వాహకులకు తెలిపింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె.. విషయాన్ని పోలీసుల దాకా తీసుకెళ్తే పీజీ పరువు పోతుందని ఇక్కడితో జరిగిన విషయాన్ని మరిచిపోవాల్సిందిగా పీజీ యాజమాన్యం తనపై ఒత్తిడి తీసుకొచ్చారని వెల్లడించింది.

కాగా.. బాధితురాలు కల్యాణ్ నగర్ లోని బ్యూటీ క్లినిక్‌లో పనిచేస్తున్నట్టుగా సమాచారం. గత నెల 23న బ్యూటీ క్లినిక్ లో డ్యూటీ ముగించుకుని.. స్నేహితుడి బైక్ పై వచ్చిన ఆమె పీజీ కి దగ్గరలోని మారెమ్మ ఆలయం వద్ద దిగింది. స్నేహితుడు వెళ్లిపోయిన తర్వాత ఏదో ఫోన్ రావడంతో అదే ప్రాంతంలో అటు-యిటు తిరుగుతూ ఆమె ఫోన్ మాట్లాడుతుండగా దుండగుడు ఆమెను బలత్కారం చేసేందుకు విఫల యత్నం చేశాడు.












Click it and Unblock the Notifications