అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల పెళ్లి ఖర్చు తెలిస్తే అవాక్కవుతారు!!

అపర కుబేరుడు, భారతదేశంలోనే అత్యంత సంపన్న వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ గుజరాత్లోని జామ్ నగర్ లో అత్యంత అట్టహాసంగా జరుగుతున్నాయి. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కోసం కోట్లాది రూపాయలను ఖర్చు పెడుతున్న ముఖేష్ అంబానీ దంపతులు, అనంత్ అంబానీ రాధిక మర్చంట్ ల పెళ్లికోసం ఎంత డబ్బు ఖర్చు పెడతారు అన్నది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న చర్చ.

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులను ఆహ్వానించారు. బిల్ గేట్స్, మార్క్ జుకర్ బర్గ్ లతోపాటు హాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులను ఆహ్వానించి అత్యంత ఘనంగా వేడుక జరుపుతున్నారు. ఇక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి ఇంతగా ఖర్చుపెడుతున్న ముఖేష్ అంబానీ దంపతులు, దేశంలోనే అత్యంత ఖరీదైన పెళ్లిగా తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది.

Anant Ambani and Radhika Merchant wedding expenses will surprise you

అనంత్ అంబానీ రాధిక మర్చంట్ ల పెళ్లి జులై నెలలో అత్యంత అట్టహాసంగా జరపబోతున్నారు. అనంత్, రాధికల విలాసవంతమైన వివాహానికి భారీగా ఖర్చు చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. అనంత్ అంబానీ వివాహానికి దాదాపు 1000 కోట్ల రూపాయలను ముఖేష్ అంబానీ దంపతులు ఖర్చు చేయనున్నట్టు ప్రస్తుతం పెద్దఎత్తున చర్చ జరుగుతుంది. ఒకవేళ ఇలా కనుక పెళ్లి జరిగితే దేశంలోనే అత్యంత ఖరీదైన పెళ్లిగా ఈ పెళ్లి నిలుస్తుందని టాక్ వినిపిస్తుంది.

గతంలో ముఖేష్ అంబానీ తన కుమార్తె ఇషా అంబానీ పెళ్లి కూడా చాలా ఘనంగా నిర్వహించారు. ఆయన తన కుమార్తె వివాహానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇషా అంబానీ తన పెళ్లిలో 90 కోట్ల రూపాయల విలువైన లెహంగాను ధరించి ప్రపంచ రికార్డు సృష్టించింది.

ఇక ఈషా అంబానీ పెళ్లి తర్వాత దేశంలో జరిగిన అత్యంత ఏదైనా వివాహం సుబ్రతా రాయ్ వివాహం. ఇప్పుడు ముఖేష్ అంబానీ అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల పెళ్లికి 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఈ పెళ్లి చరిత్ర సృష్టిస్తుందని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా పెళ్లిలో చేసే ఖర్చులలో ఎక్కువభాగం అలంకరణల కోసం, లైవ్ ప్రోగ్రాం ల కోసం ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+