మళ్ళీ అనంత్- రాధికల ప్రీ వెడ్డింగ్ వేడుకలు, సముద్రంలో ప్లాన్ చేసిన అంబానీ ఫ్యామిలీ

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, దేశంలోనే అత్యంత సంపన్నుడు ముకేష్ అంబానీ, నీతా అంబానీల తనయుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకకు ముందు మూడు రోజుల పాటు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మార్చి నెలలో గుజరాత్ జామ్ నగర్ లో అత్యంత ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మరోమారు ఫ్రీ వెడ్డింగ్ పార్టీకి సిద్ధమయ్యారు ముకేష్ అంబానీ ఫ్యామిలీ.

జామ్ నగర్ లో ఘనంగా జరిగిన అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు
మార్చి నెలలో గుజరాత్ జామ్ నగర్లో అత్యంత ఘనంగా నిర్వహించిన ఫ్రీ వెడ్డింగ్ వేడుకలలో దేశంలోనే ప్రముఖులైన వారిని సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాలకు సంబంధించిన ఎంతో మందిని అతిధులుగా ఆహ్వానించారు ఇక విదేశీ ప్రముఖులకు కూడా ముఖేష్ అంబానీ దంపతులు ఆతిథ్యం ఇచ్చారు. అప్పుడు నిర్వహించిన ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో 1200 మందికి పైగా గెస్ట్ లు ఈ వేడుకలలో సందడి చేశారు.

Anant Ambani Radhika Merchant Pre Wedding celebrations again in ocean for three days

మళ్ళీ ప్రీ వెడ్డింగ్ పార్టీకి సిద్ధమైన ముకేష్ అంబానీ ఫ్యామిలీ
ముకేష్ అంబానీ నీతా అంబానీ దంపతులు అనంత్ అంబానీ రాధిక మర్చంట్ ల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు ఏకంగా 1259 కోట్ల రూపాయలు వెచ్చించినట్టు ఫోర్స్ ఒక నివేదికలో పేర్కొంది. అనంత్ అంబానీ రాధిక మర్చంట్ల పెళ్లి జూలై నెలలో జరుగుతుందని ఇప్పటికే అన్ని వర్గాలలోను చర్చ జరుగుతుంది. అయితే అంతకంటే ముందు మరోమారు రెండోసారి ప్రీ వెడ్డింగ్ పార్టీ నిర్వహించాలని అంబానీ ఫ్యామిలీ భావిస్తున్నట్టు సమాచారం.

లగ్జరీ క్రూయిజ్ షిప్ లో మూడు రోజుల ప్రీ వెడ్డింగ్ పార్టీ
అయితే ఈసారి చాలా విభిన్నంగా, వినూత్నంగా మూడు రోజుల ప్రీ వెడ్డింగ్ పార్టీ ఒక క్రూయిజ్ షిప్ లో నిర్వహించాలని అంబానీ కుటుంబం ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇటలీ నుంచి దక్షిణ ఫ్రాన్స్ కు వెళ్లే అతి పెద్ద లగ్జరీ క్రూయిజ్ షిప్ లో మూడు రోజుల పాటు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరగనున్నట్టు సమాచారం. ఈ సెలబ్రేషన్స్ లో అతిథులు 800 మంది పాల్గొననున్నట్టు తెలుస్తుంది.

మే 28 నుండి 30 వరకు భారీగా సెలబ్రేషన్స్
మే 28 నుంచి 30 వరకు మూడు రోజులపాటు అతిపెద్ద లగ్జరీ ఓడలో సముద్రం పైన ఈ వేడుకలు జరగనున్నాయి. దాదాపు 4380 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసే ఈ షిప్ లో అట్టహాసంగా వేడుకలు నిర్వహించేందుకు, వచ్చిన అతిథులకు సేవలు అందించేందుకు 600 మంది సిబ్బందిని సిద్ధం చేస్తున్నారు. జామ్ నగర్ లో జరిగిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కంటే ఈసారి ఇంకా ఎక్కువే ఖర్చు పెట్టనున్నట్టు తెలుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+