Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

180-108కేజీలకు: అనంత్ అంబానీ ఇలాఎలా!(ఫొటోలు)

ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ రెండో కుమారుడు అనంత్ అంబానీని ఇటీవల చూసిన వారెవ్వరైనా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎందుకంటే గతంలో అధిక బరువుతో కొండలా కనిపించే ఆయన.. ఇప్పుడు ఎంతో సన్నబడి స్మార్ట్‌గా కనిపించడమే కారణం. ఇంత మార్పు ఎలా సాధ్యమైందబ్బ అని గుసగుసలాడుకుంటున్నారు.

కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌ల సందర్భంగా తమ ముంబై జట్టుతో సందడి చేసిన అనంత్ ... భారీ కాయంతో దర్శనమిచ్చాడు. అయితే ఇప్పుడు ఏకంగా, 180 కేజీల బరువున్న అతడు కేవలం 18 నెలల్లో బాగా కష్టపడి 108 కేజీల తగ్గిపోయి .. చక్కగా స్లిమ్ గా తయారయ్యాడు.

కాగా, అతడు సన్నబడేందుకు చాలా వరకు సహజ మార్గాలనే అనుసరించాడు. రోజుకు 5- 6 గంటలు పాటు వ్యాయామం చేసేవాడు. అలాగే ప్రతిరోజూ 21 కిలోమీటర్లు నడక సాగించేవాడు. వీటితోపాటు యోగా.. అధిక తీవ్రత ఉన్న గుండెకు సంబంధించిన వ్యాయామం చేశాడు.

Anant Ambani weight loss: How he lost 108 kg in 18 months!

సరిపడనంత ప్రోటీనులనే తీసుకున్నారు. అనంత్ ఇలా మారడం కోసం అతడి తల్లి నీతా అంబానీ అన్ని దగ్గర ఉండి చూసుకున్నారట. అనంత్ చిన్నతంలో ఆస్తమాతో బాధపడేవాడు. ఆ సమయంలో వాడిన మందుల వల్ల భారీ స్థూలకాయం వచ్చిందని తెలిసింది.

ఇదే రీతిలో ఉంటే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరించారు. దీంతో తన బరువును భారీగా తగ్గించుకున్నాడు. జంతు ప్రేమికుడైన అనంత్ ప్రస్తుతం యూఎస్‌లోని బ్రౌన్ యూనివర్సిటీలో చదువుతున్నారు. కాగా, ఐపిఎల్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో మరోసారి అనంత్ తన స్లిమ్ లుక్‌లో స్టేడియంలో సందడి చేసే అవకాశం లేకపోలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+