వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయాలు: అన్నా హజారే ఓడిన చోట కేజ్రీవాల్ గెలిచాడు

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే ఓడిపోయిన చోట ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ విజయం సాధించారు. రాజకీయాలను కార్యరంగంగా మార్చుకోవడానికి అన్నా హజారే ఇష్టపడలేదు. అయితే, తన గురువు అన్నా హజారేతో విభేదిస్తూ కేజ్రీవాల్ రాజకీయాలను సవాల్‌గా స్వీకరించారు. జన్ లోక్‌పాల్ కోసం ఉద్యమం సాగిస్తున్నప్పుడు రాజకీయాల్లో ఉంటే ఏమిటో తెలుస్తుందని, రాజకీయాల్లో లేరు కాబట్టి ఏదైనా మాట్లాడుతారని, ఏదైనా చేస్తారని రాజకీయ నాయకులు తమపై చేసిన వ్యాఖ్యలే కేజ్రీవాల్‌కు సవాల్ విసిరాయి. దాంతోనే ఆయన ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు. రాజకీయాల్లోకి చీపురు పట్టుకుని దిగారు.

రాజకీయాల్లోకి రాక ముందు అరవింద్ కేజ్రీవాల్ ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ (ఐఆర్ఎస్)లో అధికారిగా పనిచేశారు. పేదల పక్షాన నిలబడి వారికి న్యాయం చేయడానికి కృషి చేశారు. సమాచార హక్కు చట్టాన్ని సామాన్య మానవువలు ఆయుధంగా మలచడంతో ఆయన విజయం సాధించారు. అందుకు ఆయనకు 2006లో ప్రతిష్టాత్మకమైన మెగసెసే అవార్డు లభించింది.

హర్యానాలోని హిస్సార్‌లో 1968లో జన్మించిన కేజ్రీవాల్ ఖరగ్‌పూర్ ఐఐటిలో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చదివారు. 1989లో టాటా స్టీల్ కంపెనీ ఉద్యోగంలో చేరారు. మూడేళ్ల తర్వాత ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి 1992లో యుపిఎస్సీ పరీక్షలు రాసి రెవెన్యూ సర్వీసులో చేరారు. ఆ తర్వాత ఆ ఉద్యోగానికి కూడా రాజీనామా చేశారు .

ఉద్యోగాలు మానేసి ఆయన పీపుల్ కాజ్ ఫౌండేషన్ అనే ఎన్జీవోను స్థాపించారు. అప్పటి నుంచి పూర్తి స్థాయి సామాజిక కార్యకర్తగా మారిపోయారు. ఆయన పూర్తిగా శాకాహారి. ఎక్కడు ఉన్నా వెంట తెచ్చుకున్న ఇంటి భోజనమే చేస్తారు. తనతో పాటు ఐఆర్ఎస్‌లో చేరిన సునీతను వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు పిల్లలు. కూతురు హర్ష, కుమారుడు పునీత్.

 Anna hazare rejects: Kejriwal takes as challenge

దేశంలోని అవినీతి జాడ్యాన్ని నిర్మూలిస్తే తప్ప దేశం బాగుపడదని భావించిన సామాజిక కార్యకర్త అన్నా హజారే పిలుపునకు స్పందించి ఆయనకు అండగా నిలిచారు. అవినీతిని అంతమొందించడానికి పటిష్టమైన జన లోక్‌పాల్ బిల్లు తేవాలని హజారే చేపట్టిన ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయనతో కలిసి ధర్నాలు, దీక్షలు, వరుస ఆందోళనలు చేపట్టారు. అన్నా హజారే ఆందోళనతో ప్రభుత్వం లోక్‌పాల్ బిల్లు తెచ్చినప్పటికీ దాంట్లో లొసుగులు చోటు చేసుకోవడాన్ని అన్నా హజారేతో పాటు వ్యతిరేకించారు. దానికితోడు చట్టం చేసినప్పటికీ అమలు చేయడంలో చిత్తశుద్ధి అమలులో లేకపోతే ఫలితం ఉండదని కేజ్రీవాల్ గ్రహించాడు.

రాజకీయాల్లోకి తాము స్వయంగా రావడం ద్వారానే వాటిని ప్రక్షాళన చేయవచ్చునని ఆయన భావించారు రాజకీయాలు ఓ బురదగుంట అని, అందులోకి దిగితే బయటకు రాలేమని, సామాజిక కార్యకర్తలుగానే తమ కర్తవ్యాన్ని నిర్వహిద్దామని గురువు అన్నా హజారే చెప్పినా కేజ్రీవాల్ వినలేదు. రాజకీయాల్లోకి దిగారు.

ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి, చీపురు గుర్తును ఎంచుకుని గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి 28 సీట్లను సాధించారు. అయితే, సంపూర్ణమైన మెజారిటీ రాలేదు. దాంతో కాంగ్రెసు మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఎంతో కాలం ప్రభుత్వాన్ని నిలబెట్టుకోలేకపోయారు. 49 రోజుల్లోనే రాజీనామా చేశారు. నిరుడు ఫిబ్రవరి 14వ తేదీన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి బిజెపి ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు సాగిస్తూ వచ్చింది. కానీ, అది సాధ్యం కాలేదు. దాంతో ఎన్నికలు అనివార్యంగా మారాయి. ఈ ఎన్నికల్లో మరో పార్టీకి చోటు లేకుండా ఊడ్చేసి సంపూర్ణమైన మెజారిటీని సాధించారు.

English summary
Aam Aadmi party (AAP) chief Arvind Kejriwal unlike Anna Hazare took politics as a challenge in delhi and prooved himself in politics defeating BJP and Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X