కునో నేషనల్ పార్క్‌లో మరో చీతా మృతి: నెల వ్యవధిలోనే మరో విషాదం

భోపాల్: దేశంలో నెల రోజుల వ్యవధిలోనే మరో చీతా మృతి చెందింది.
కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ చీతాలో భాగంగా నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి 20 చీతాలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వీటిలో సాశా అనే ఆడ చీతా అనారోగ్యంతో ఈ ఏడాది మార్చి నెలలో ప్రాణం విడిచింది. తాజాగా, రెండో విడతలో దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన ఉదయ్ అనే మరో మగ చీతా అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది.

ఈ చీతా మృతిని కునో జాతీయ పార్క్(Kuno National Park) చీఫ్ కన్జర్వేటివ్ అధికారి జేఎస్ చౌహాన్ ధృవీకరించారు. చీతా మృతికి కారణాలు తెలియాల్సి ఉందన్నారు. ఆదివారం ఉదయం ఉదయ్ అనే చీతా అనారోగ్యంగా ఉండటం సిబ్బంది గుర్తించారు. ఆ తర్వాత ఆ చీతాను జాగ్రత్తగా వైద్య కేంద్రానికి తీసుకొచ్చి చికిత్స అందించారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో చికిత్స పొందుతూ చీతా మృతి చెందింది అని ఆయన తెలిపారు.

Another Cheetah Died In Kuno National Park,

మృతి చెందిన చీతాకు సోమవారం పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు చౌహాన్ వెల్లడించారు. ప్రాజెక్ట్ చీతాలో భాగంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం రెండు విడతల్లో 20 చీతాలను మనదేశానికి తీసుకొచ్చింది. వాటిని ప్రధాని నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్క్‌లోని ప్రత్యేక ఎన్‌క్లోజర్‌లో విడుదల చేశారు. మొదటి విడతలో గత సెప్టెంబర్ 17న నమీబియా నుంచి 8 చీతాలను తీసుకువచ్చారు. అయితే, వాటిలో సాశా అనే ఆడ చీతా అనారోగ్యంతో ఈ ఏడాది మార్చి 27న మృతి చెందింది.

రెండో విడతలో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి 18న 12 చీతాలను దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చారు. వాటిలో తాజా ఉదయ్ అనే మగ చీతా చనిపోయింది. అయితే, తొలి విడతలో నమిబీయా నుంచి తీసుకొచ్చిన చీతాల్లో ఒక చీతా మార్చి 29న నాలుగు కూనలకు జన్మనిచ్చింది. ఇటీవలే ఆ చీతాలకు ప్రధాని మోడీ అభ్యర్థన మేరకు ప్రజలు సూచించిన దేశీయ పేర్లను పెట్టారు. వీటిలో కవల చీతాలైన ఎల్టన్, ఫ్రెడ్డీలకు గౌరవ్, శౌర్య అనే పేర్లు, నాలుగు కూనలకు జన్మనిచ్చిన సియాయా చీతాకు జ్వాలా అనే పేర్లు పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+