AP-TS weather update: తెలుగు రాష్ట్రాల్లో మరికొద్ది రోజులు విస్తారంగా వర్షాలు

హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరికొద్ది రోజులపాటు ఈ వర్షాలు కొనసాగనునున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

10°ఉత్తర అక్షాంశము వెంబడి తూర్పు-పడమర 'షీర్ జోన్' సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్య కొనసాగుతున్నది. మంగళ, బుధ, గురువారాల్లో ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

 APTS weather update: few more days rains in andhra pradesh and telangana.

మంగళ, బుధవారాల్లో దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. .

రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. బుధ, గురువారాల్లో రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

తెలంగాణలోనూ మరో మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు

Recommended Video

    కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మండి పడ్డి మంత్రి ఎర్రబెల్లి, బాల్క సుమన్

    తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 28వ తేదీ వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలోకి పశ్చిమ, నైరుతి దిశల నుంచి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆగస్టు 28వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
    గడిచిన 24 గంటల్లో వరంగల్‌, హన్మకొండ, మహబూబాబాద్‌, ములుగు మినహా మిగిలిన అన్నిజిల్లాల్లో వర్షం కురిసినట్లు తెలిపింది.

    మేడ్చల్‌- మల్కాజిగిరి, హైదరాబాద్‌, సిద్దిపేట, సంగారెడ్డి, జోగులాంబ-గద్వాల, నారాయణపేట, రంగారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, యాదాద్రి భువనగిరి, కొమురంభీమ్‌ ఆసిఫాబాద్‌, వికారాబాద్‌, అదిలాబాద్‌ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఉప్పల్‌లో 9, సీతాఫల్‌మండి, వెస్ట్‌మారేడ్‌పల్లి, పికెట్‌, జోగులాంబ-గద్వాల జిల్లా ఐజలలో 7, సిద్దిపేట జిల్లా కోహెడలో 8 సెంటీ మీటర్ల వర్షపాతం న‌మోదైన‌ట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+