ఆర్మీలో హోమోసెక్స్, వ్యభిచారంపై ఛీఫ్ ఏమన్నారో చూడండి

భారత ఆర్మీ ఇంకా పాశ్చాత్య దేశ ఆర్మీలా తయారు కాలేదని అన్నారు ఆర్మీ ఛీఫ్ జనరల్ బిపిన్ రావత్. ఆర్మీలో స్వలింగ సంపర్కం, వ్యభిచారం జరుగుతున్నాయన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన తీవ్రంగా స్పందించారు. అలాంటివేమీ ఆర్మీలో జరగవని ఎవరో అసత్య ప్రచారాలు చేస్తున్నారని వెల్లడించారు. అలాంటివి జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఇదిలా ఉంటే 2018 సెప్టెంబరులో స్వలింగ సంపర్కం, వ్యభిచారం నేరం కాదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఆర్మీలో ఉన్న చట్టాలు దేశ చట్టాలకంటే ఎక్కువ కాదని అయితే మన ఆర్మీ పాశ్చాత్య పోకడలకు పోదని స్పష్టం చేశారు. ఈ విషయంలో మాత్రం భారత ఆర్మీకి వందకు వంద మార్కులు ఇవ్వొచ్చన్నారు. స్వలింగసంపర్కం, వ్యభిచారం నేరం కాదని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ... ఆర్మీ చట్టాలను తాము అనుసరిస్తామని వాటి ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు రావత్.

Army chief rules out gay sex, adultery in Indian Army

ఆర్మీలో పనిచేసే వారెవరైనా సరే 1950 ఆర్మీ చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని వెల్లడించారు.ఎవరైనా క్రమశిక్షణ తప్పి ప్రవర్తించినా, ఇతర అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడినా వారికి ఆర్మీ చట్టం కింద ఏడేళ్ల జైలు శిక్ష ఉంటుందని బిపిన్ రావత్ వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+