దేశం కోసం సైనికుడి ప్రాణత్యాగం, ఫ్యామిలీ టార్చర్ తో జవాను భార్య, కూతురు ?
బెంగళూరు/బెళగావి: శత్రు సైనికుల చొరబాటు నుంచి దేశ సరిహద్దులను కాపాడుతూ ప్రాణత్యాగం చేసిన ఓ సైనికుడి భార్యకు ఆమె సొంత ఇంట్లో రక్షణ లభించలేదు. ఇంట్లో ప్రశాంతంగా జీవించేందుకు వీలు లేదని ఆ సైనికుడి భార్య ఆమె కుమార్తెతో పాటు ఆత్మహత్య చేసుకుంది. సొంత సోదరుడు, వదిన టార్చర్ తట్టుకోలేక సైనికుడి భార్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
అదే తాడుకు కూతురితో ఉరివేసుకుని ఓ గృహిణి ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటకలోని బెళగావి జిల్లా కిత్తూరు తాలూకా దిండాలకొప్ప గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఓ జవాను భార్య మహాదేవి ఇంచాల్ అలిమాస్ మహాదేవి (34), ఓ జవాను కుమార్తె చందని ఇంచాల్ (7) ఆత్మహత్య చేసుకున్నారు. గోకాక్ తాలూకాలోని ఖనగావ్ గ్రామానికి చెందిన సైనికుడిని మహాదేవి వివాహం చేసుకుంది.

పెళ్లయిన రెండేళ్లకే మహాదేవి భర్త సైనికుడిగా పనిచేస్తూ భారత సరిహద్దులో ప్రాణత్యాగం చేశాడు. అప్పటికే మహాదేవికి కుమార్తె పుట్టింది. భర్త చనిపోవడంతో మహాదేవి ఆమె కుమార్తెతో కలిసి దిండాలకొప్పలోని తన పుట్టింటిలో నివసిస్తోంది. భర్త చనిపోయి 7 ఏళ్లు గడిచినా ఆ సైనికుడి భార్య మహాదేవిని ఇల్లు వదిలి వేరే చోటికి వెళ్లకుండా ఆమె సొంత కుటుంబసభ్యులు అడ్డుకుంటూ వచ్చారు.
భార్యను చంపేసి ఆమె తెలివైన మెదడు, మాంసం తినేసిన భర్త, మ్యాటర్ మాత్రం !
ఇంట్లో సొంత సోదరుడు, వదిన వేధింపులతో విసిగి వేసారిన మహాదేవి సోమవారం మధ్యాహ్నం కూతురితో కలిసి ఉరివేసుకుంది. ఈ ఘటన బెళగావిలోని కిట్టూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకోవడం కలకలం రేపింది. సైనికుడి భార్య మహాదేవి భర్త చనిపోయాక విడివిడి ఉంటూ జీవించాలని అనుకుంది. తాను తన కూతురితో కలిసి వేరుగా ఉంటానని ఆమె కుటుంబ సభ్యులను వేడుకుంది.

తన కూతురిని బాగా చదివించి ఆమెకు మంచి ఉద్యోగం ఇప్పించాలని ఆమె కుటుంబ సభ్యులను వేడుకున్నా ఆమె సోదరుడు, వదిన మహాదేవి ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి అంగీకరించలేదని తెలిసింది. తనను హాయిగా బతకనివ్వకుండా తన కూతురికి మంచి భవిష్యత్తును కల్పించేందుకు అడ్డుగా ఉన్నారని ఆవేదిన చెందిన మహాదేవి తట్టుకోలేకపోయింది. సొంత కుటుంబ సభ్యుల వేధింపులతో విసిగిపోయి కూతురితో సహ మహాదేవి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు అన్నారు. సైనికుడిగా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తి భార్య, ఆయన కూతురు కుటుంబ సభ్యుల టార్చర్ తో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.












Click it and Unblock the Notifications