Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆర్మీ మేజర్ దారుణం: పెళ్లి చేసుకోలేదని మరో మేజర్ భార్య హత్య, వివాహేతర సంబంధం!

Recommended Video

    పెళ్లి చేసుకోలేదని మరో మేజర్ భార్య హత్య, వివాహేతర సంబంధం!

    న్యూఢిల్లీ: ఓ సైనిక మేజర్ భార్య హత్య కేసులో మరో సైనిక మేజర్‌ను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఢిల్లీలోని కంటోన్మెంట్ ప్రాంతంలో శనివారం సాయంత్రం మేజర్ అమిత్ ద్వివేది భార్య శైలజ ద్వివేది మృతదేహం లభ్యమైంది. ఆమెను మేజర్ నిఘిల్ హండా గొంతు కోసి చంపేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

    అమిత్ ద్వివేదీ, శైలజా ద్వివేదీలు తమ ఆరేళ్ల కొడుకుతో పాటు న్యూఢిల్లీలోని నారాయణ ఆర్మీ క్వార్టర్స్‌లో నివసిస్తున్నారు. ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ ఆసుపత్రిలో ఫిజియోథెరపీ సెషన్ కోసం శైలజ శనివారం ఉదయం ఇంటి నుంచి వెళ్లింది. ఆ తర్వాత సాయంత్రం కూడా ఆమె తిరిగి రాలేదు.

    ఇంటి నుంచి వెళ్లిన శైలజ తిరిగి రాలేదు

    ఇంటి నుంచి వెళ్లిన శైలజ తిరిగి రాలేదు

    ఆ తర్వాత చూడగా, శనివారం సాయంత్రం శైలజ ద్వివేది మృతదేహం లభ్యమైంది. ఆమెను మేజర్‌ నిఖిల్‌ హండా గొంతు కోసి హత్య చేసినట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు. తనను ఆమె పెళ్లి చేసుకునేందుకు అంగీకరించట్లేదన్న అక్కసుతోనే అతడు ఈ దారుణానికి పాల్పడ్డాడని తెలిపారు. హండాకు శైలజతో వివాహేతర సంబంధం ఉందని కూడా అంటున్నారు.

    ఈ హత్యను రోడ్డు ప్రమాదంలా

    ఈ హత్యను రోడ్డు ప్రమాదంలా

    శైలజను హత్య చేసిన తర్వాత నిందితుడు ఆమె పై నుంచి కారును పోనిచ్చాడు. తద్వారా ఈ హత్యను రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించే ప్రయత్నాలు చేశాడు. మూడేళ్ల క్రితం నుంచి అమిత్‌ కుటుంబంతో హండాకు పరిచయం ఉందని, అప్పుడు వారు నాగాలాండులో కలిసి పని చేసేవారని పోలీసులు తెలిపారు. అమిత్‌కు ఢిల్లీకి బదలీ కావడంతో శైలజ కూడా ఆయనతో పాటే ఢిల్లీకి వచ్చిందన్నారు.

    ఆసుపత్రికి శైలజ, అక్కడకు హండా వచ్చారు

    ఆసుపత్రికి శైలజ, అక్కడకు హండా వచ్చారు

    శైలజను హండా ఇష్టపడ్డాడని, తరుచూ తనను పెళ్లి చేసుకోమని కోరేవాడని, అందుకు ఆమె నిరాకరిస్తూ వచ్చిందని పోలీసులు తెలిపారు. శైలజ ఫోన్‌లోని సమాచారం ఆధారంగా హండాతో ఆమెకు విభేదాలు తలెత్తినట్లు గుర్తించామని తెలిపారు. ఫిజియోథెరపీ చేయించుకునేందుకు అని చెప్పి శైలజ కంటోన్మెంట్‌ ప్రాంతంలోని సైనిక ఆసుపత్రికి వెళ్లారని, అక్కడికు హండా వచ్చినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయి ఉందని పోలీసులు తెలిపారు.

    శైలజ, హండా కారులో వెళ్లారు, హత్య

    శైలజ, హండా కారులో వెళ్లారు, హత్య

    అతడితో కలిసి శైలజ కారులో బయటకు వెళ్లారని వెల్లడించారు. అమిత్‌ కూడా హండాపై అనుమానం వ్యక్తం చేశారన్నారు. కారులో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుందని, దీంతో హండా కత్తితో శైలజ గొంతును కోశాడన్నారు. యూపీలోనీ కంటోన్మెంట్‌లోని ఆఫీసర్స్‌ మెస్‌లో హండా తలదాచుకున్నట్లు తెలిసిందని, ఆదివారం అక్కడి నుంచి కారులో పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా అతడిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+