ఆర్మీ అధికారి ఆత్మహత్య, నిధుల దుర్వినియోగం ఆరోపణలే కారణమా?

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ:ఢిల్లీలోని ద్వారకాలోని ఓ అపార్ట్ మెంట్ లో ఆర్మీ అధికారి లెఫ్టినెంట్ జగదీష్ ప్రకాష్ శుక్రవారం నాడు ఆత్మహత్య చేసుకొన్నాడు.

కేరళకు చెందిన ఆయన ప్రస్తుతం రాజాజీ మార్గ్ లోని కశ్మీర్ హౌస్ లో విదులను నిర్వహిస్తున్నాడు. సంఘటన స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదు.

సిలిగురి, అస్సాం లలో నిధుల దుర్వినియోగం విషయంలో జగదీష్ ప్రసాద్ పై ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై ఆయన తీవ్రమైన ఒత్తిడితో ఉండేవారని కుటుంబసభ్యులు చెప్పారు.అయితే ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని డిల్లీ సౌత్ వెస్ట్ డిసిపి సురేందర్ కుమార్ చెప్పారు.

army officer suicide

న్యూఢిల్లీలోని సలారియా అపార్ట్ మెంట్ సెక్టార్ 20 నుండి శుక్రవారం ఉదయం జగదీష్ ప్రకాష్ ఆత్మహత్య చేసుకొన్న విషయం పోలీసులకు సమాచారం వచ్చిందని ఆయన చెప్పారు. తాము వచ్చేసరికి జగదీష్ ప్రకాష్ మెట్లకు ఉన్న గ్రిల్స్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడని సురేందర్ కుమార్ చెప్పారు.

గత ఏడేండ్ల నుండి ఇదే ప్రాంతంలో భార్య , ఇద్దరు పిల్లలతో జగదీష్ ప్రకాష్ నివసిస్తున్నాడు.కొన్ని వారాలుగా జగదీష్ ప్రకాష్ డిప్రెషన్ కు గురైనట్టుగా ఆయన భార్య పోలీసులకు చెప్పారు

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 46-year-old Lieutenant Colonel of the Indian Army allegedly committed suicide outside his house in southwest Delhi's Dwarka area this morning.
Please Wait while comments are loading...