Article 142: సుప్రీంకోర్టు ఎలా ఎందుకు ఎప్పుడు ఈ అధికరణను ప్రయోగిస్తుంది..?
Article 142:సుప్రీంకోర్టులో చరిత్ర గుర్తుంచుకునేలా తొలిసారిగా ఓ సంఘటన చోటుచేసుకుంది. చండీగఢ్ మేయర్ ఎన్నికలో అవకతవకలు జరిగాయంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో ఆ పిటిషన్ విచారణ చేసిన అత్యున్నత ధర్మాసనం ఆప్-కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి కుల్దీప్ కుమార్‌ను మేయర్‌గా ప్రకటించింది. రిటర్నింగ్ ఆఫీసర్ నాడు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టింది. అయితే సుప్రీం కోర్టు ఇలా ఒక అభ్యర్థిని విజేతగా ప్రకటించే హక్కు ఉందా..? ఉంటే రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ఇది జరుగుతుంది..?
చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో రిటర్నింగ్ ఆఫీసర్ అనిల్ మాసి 8 బ్యాలెట్లను లెక్కించకుండా పక్కన పెట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ఇక సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కావడంపై రాజ్యాంగంలోని 142 అధికరణ ప్రకారం ఈ కేసులో పూర్తిగా న్యాయం జరగలేదని అత్యున్నత న్యాయస్థానం భావించింది. రిటర్నింగ్ ఆఫీసర్ అభ్యర్థిని విజేతగా ప్రకటించే ప్రక్రియ చట్ట విరుద్ధంగా జరిగిందని అభిప్రాయపడింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ఏం చెబుతోంది..? ధర్మాసనం ముందుకు వచ్చిన ఒక కేసును విచారణ చేసి పూర్తి న్యాయం జరిగేలా అందుకు సంబంధించి ఆదేశాలు ఇచ్చేలా రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 సుప్రీంకోర్టుకు అధికారాన్నిస్తోంది. భారత భూభాగంలో ఏ సంఘటనకు సంబంధించైనా సరే పూర్తి న్యాయం చేసేందుకు వీలు కల్పిస్తోంది ఆర్టికల్ 142.

ఆర్టికల్ 142 ప్రాముఖ్యత:
* కేసుతో ప్రమేయం ఉన్న పార్టీలకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా ప్రస్తుత చట్టం లేదా శాసనం పరిమితులను అధిగమించి తీర్పు ఇచ్చేందుకు సుప్రీంకోర్టుకు ఆర్టికల్ 142 ఒక ప్రత్యేక అధికారాన్నిస్తుంది.
* సాధారణంగా ఎగ్జిక్యూటివ్ మరియు లెజిస్లేటివ్ ద్వారా మాత్రమే అమలు కావాల్సిన వాటిలో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుని అమలు చేసేలా ఆర్టికల్ 142 అధికారమిస్తోంది. ఉదాహరణకు మార్గదర్శకాల జారీ, సూచనలు, ప్రభుత్వాలకు ఇతర అధికారులకు ఆదేశాలివ్వడం వంటివి.
* ప్రజాప్రయోజనం, మానవ హక్కులు, రాజ్యాంగ విలువలు, ప్రాథమిక హక్కులు ఉల్లంఘనకు గురవుతున్నాయని సుప్రీంకోర్టు భావిస్తే.. ఆ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుని వాటిని పరిరక్షించేందుకు ఆర్టికల్ 142 అనుమతిస్తోంది.
* రాజ్యాంగ పరిరక్షించడం, చట్టం సక్రమంగా అమలయ్యేలా చూడటంలో సుప్రీం కోర్టు క్రియాశీలకంగా వ్యవహరించడంతో పాటు, కీలక పాత్ర పోషించాల్సిందిగా ఆర్టికల్ 142 చెబుతోంది.
ఆర్టికల్ 142ను సుప్రీంకోర్టు ఏ కేసుల్లో వినియోగించింది:
* నేరస్తులు తాము చేసిన నేరానికి పడే శిక్షలో భాగంగా.. సగానికిపైగా వారు విచారణ పేరుతో జైలు జీవితం గడిపితే వారి విడుదలకు ఆదేశాలు ఇచ్చే అధికారం
* 6 నుంచి 14 ఏళ్ల వయసున్న పిల్లలకు తప్పనిసరిగా ఉచిత విద్యను అందించాలని ప్రభుత్వాలకు సూచనలు చేయడం
* 2జీ స్పెక్ట్రమ్ స్కామ్‌లో విచారణ సక్రమంగా జరుగుతుందా లేదా అని చూసేందుకు కమిటీని నియమించడం
* అక్రమంగా, ఏకపక్షంగా ఉన్నట్లు తేలిన 214 బొగ్గు బ్లాకుల కేటాయింపులను రద్దు చేయడం.
* భారత సైన్యంలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ను మంజూరు చేయడం.
-
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications