ఎన్నికల షెడ్యూల్ ఆలస్యం ? ఈసీ రాజీనామా ఎఫెక్ట్-15న సెలెక్ట్ కమిటీ భేటీ..!

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ కోసం రాజకీయ పార్టీలు, నేతలు, సాధారణ ఓటర్లు ఎదురుచూస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘంలో కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చిచ్చు రేపుతోంది. మరో రెండు మూడు రోజుల్లో లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుందని అంతా ఎదురుచూస్తుండగా.. అరుణ్ గోయల్ చివరి నిమిషంలో చేసిన రాజీనామాతో ఇప్పుడు ఎన్నికల నిర్వహణ, కీలక నిర్ణయాలపై ప్రభావం పడబోతోంది. ఈ నేపథ్యంలో కొత్త కమిషనర్ల ఎంపిక కోసం ఈ నెల 15న సెలెక్ట్ కమిటీ భేటీ అవుతోంది.

కేంద్ర ఎన్నికల సంఘంలో సీఈసీ రాజీవ్ కుమార్ తో పాటు అరుణ్ గోయల్ మాత్రమే మిగిలున్న తరుణంలో కీలకమైన సార్వత్రిక ఎన్నికల నిర్వహణను వీరిద్దరే పర్యవేక్షిస్తారని అంతా భావించారు. కానీ గోయల్ అనూహ్యంగా తప్పుకున్నారు. ఆయన రాజీనామాకు వ్యక్తిగత కారణాలు చూపుతున్నా.. రాజీవ్ కుమార్ తో విభేదాల వల్లే ఆయన తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కారణాలు ఏవైనా గోయల్ చివరి నిమిషంలో తప్పుకోవడంతో ఈ నెల 13 లేదా 14వ తేదీ వెలువడుతుందని భావించిన షెడ్యూల్ కాస్తా ఆలస్యం కాబోతోంది.

arun goel resignation affect on loksabha election schedule release after new ec selection on mar 15

అరుణ్ గోయల్ రాజీనామాతో ఈసీలో ప్రస్తుతం రాజీవ్ కుమార్ ఒక్కరే మిగిలారు. దీంతో ఇద్దరు కమిషనర్లను వెంటనే నియమించాల్సిన పరిస్దితి ఏర్పడింది. దీంతో ప్రధాని మోడీ, ఓ కేంద్రమంత్రి, విపక్ష నేతతో కూడిన సెలెక్ట్ కమిటీ ఈ నెల 15న భేటీ కావాలని నిర్ణయించింది. కొత్త కమిషనర్ల నియామక ప్రక్రియలో న్యాయ మంత్రి నేతృత్వంలోని సెలెక్ట్ కమిటీ, ఇద్దరు కేంద్ర కార్యదర్శులు సహా ఐదు పేర్లను షార్ట్‌లిస్ట్ చేస్తారు. తర్వాత ప్రధాని నేతృత్వంలోని ఎంపిక కమిటీ తుది అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వారి నియామకాల్ని రాష్ట్రపతి ఆమోదించి గెజిట్ ద్వారా విడుదల చేస్తారు.

అయితే ఈ ప్రక్రియ మార్చి 15న ప్రారంభం కానుండటంతో ఎంత హడావిడిగా చేసినా కనీసం 16వ తేదీ వరకూ కొనసాగుతుంది. ఆ తర్వాత కొత్త కమిషనర్లతో సీఈసీ రాజీవ్ కుమార్ భేటీ అయి లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్స్ పై చర్చిస్తారు. అంటే కనీసం 17వ తేదీ లేదా ఆ తర్వాతే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+