Union Budget 2020: ఢిల్లీకి ఏమిచ్చారు? బీజేపీకి ఎందుకు ఓటు వెయ్యాలి: కేజ్రీవాల్ ఎన్నికల నినాదం..!
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. దేశానికి రాజధానిగా ఉన్నప్పటికీ.. న్యూఢిల్లీకి బడ్జెట్‌లో నిధులను కేటాయించలేదని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మరోసారి ఢిల్లీవాసులపై సవతితల్లి ప్రేమను ప్రదర్శించిందని మండిపడ్డారు. బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు లేకపోవడంపై ఢిల్లీ బీజేపీ నాయకులు ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు..
నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ముగిసిన కొద్దిసేపటికే ఆయన ఆయన ట్విట్టర్‌లో స్పందించారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఢిల్లీ వాసులు బీజేపీకి ఏ కారణంతో ఓటు వేయాలని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందే బీజేపీ ఢిల్లీ పట్ల వివక్షను ప్రదర్శిస్తోందని, ఇక ఎన్నికల తరువాత అధికారంలోకి వస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందని, తన ఎన్నికల హామీలను నెరవేర్చగలదా? అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.

ఎన్నికల ముంగిట్లో ఉన్నందున.. వాటిని దృష్టిలో పెట్టుకుని అయినా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీపై వరాల జల్లు కురిపిస్తుందని సగటు ఢిల్లీ పౌరుడు ఆశించారని అన్నారు. ఢిల్లీ సంక్షేమానికి కొద్దో, గొప్పో నిధులను కేటాయిస్తుందని భావించారని చెప్పారు. వారి ఆశలను కేంద్ర ప్రభుత్వం నీరుగార్చిందని అన్నారు. ఢిల్లీవాసుల పట్ల బీజేపీకి ఎంత ప్రేమ ఉందనేది ఈ బడ్జెట్‌తో తేటతెల్లమైందని విమర్శించారు.
दिल्ली के लोगों को पूरी उम्मीद है कि केंद्र सरकार बजट में दिल्ली के हितों की रक्षा करेगी। चुनाव के मद्देनजर दिल्ली को और भी ज़्यादा मिलना चाहिए। बजट बताएगा कि भाजपा को हम दिल्लीवालों की कितनी परवाह है।
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 1, 2020
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు పెద్ద ఎత్తున నిధులను సమకూర్చుతుందని భావించామని, చివరికి మొండిచెయ్యి చూపిందని ఆరోపించారు. ఇదే అంశాన్ని తాము తాజాగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా జనంలోకి తీసుకెళ్తామని కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీకి ఏమిచ్చారు? బీజేపీకి ఎందుకు ఓటు వెయ్యాలి.. ? అనే నినాదంపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తామని అన్నారు. ఓడిపోతామని తెలిసే.. ఢిల్లీకి నిధులను మంజూరు చేయలేదని ఆయన ధ్వజమెత్తారు.
दिल्ली को बजट से बहुत उम्मीदें थी। लेकिन एक बार फिर दिल्ली वालों के साथ सौतेला व्यवहार हुआ। दिल्ली भाजपा के प्राथमिकताओ में आता ही नहीं, तो दिल्ली वाले भाजपा को वोट क्यों दे? सवाल ये भी है की चुनाव से पहले ही जब भाजपा दिल्ली को निराश कर रही है तो चुनाव के बाद अपने वादे निभाएगी?
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 1, 2020
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications