కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా అశోక్ గెహ్లాట్..?
ఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు రాహుల్ గాంధీ ససేమిరా అనడంతో ఇక కొత్త ప్రెసిడెంట్ ఎంపిక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ సీనియర్లలో ఒకరికి ఆ బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమవుతున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రెసిడెంట్ రేసులో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పేరు వినిపిస్తోంది. ఆయనకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశముందని పార్టీ వర్గాలు సైతం అంటున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. పార్టీ సీనియర్లు నచ్చజెప్పినా ఆయన మాత్రం పట్టు వీడటంలేదు. దీంతో కొత్త ప్రెసిడెంట్ ఎవరన్న దానిపై చాలారోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా పార్టీతో సుదీర్ఘ అనుబంధం, రాజకీయ అనుభవం ఉన్న అశోక్ గెహ్లాట్‌కు కాంగ్రెస్ పగ్గాలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Recommended Video


ప్రస్తుతం గెహ్లాట్ రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ పదవితో పాటు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగానూ ఆయన కొనసాగుతారన్న వార్తలు వస్తున్నాయి. పార్టీ సీనియర్లతో పాటు రాహుల్ కుటుంబసభ్యులు సైతం అశోక్ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే కాంగ్రెస్ సీనియర్ నేత అస్లాం షేర్ ఖాన్ రెండేళ్ల పాటు కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టడానికి తనకు తగిన అర్హతలున్నాయని బహిరంగంగా ప్రకటించారు. కర్నాటక సీనియర్ నేత వీరప్ప మొయిలీ సైతం అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని పరోక్షంగా సంకేతాలిచ్చారు.












Click it and Unblock the Notifications