కఠినమైన ప్రశ్నలు వేయండి.. కానీ సమాధానం చెప్పే వరకు ఓపికగా ఉండండి: మోడీ
వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం వేళ ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్షాలకు కీలక సూచన చేశారు. ప్రజా సమస్యలపై విపక్షాలు ప్రశ్నలు వేయాలని.. కఠినమైన కొశ్చన్స్ వేయాలని కోరారు. కానీ అదే సమయంలో ప్రభుత్వం చెప్పే సమాధానం కూడా ఓపికగా వినాలని సూచించారు. సభ గౌరవం కాపాడి, హుందగా ప్రవర్తించాలని ఎంపీలు, పార్టీలను మోడీ కోరారు. సమావేశాలకు వెళ్లే కాస్త ముందు మోడీ ఈ సజెషన్ చేశారు.
ఇలా చేయడం వల్ల ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందని మోడీ అభిప్రాయపడ్డారు. ప్రజల నమ్మకం పెరిగి, అభివృద్దిలో కీ రోల్ పోషించే అవకాశం ఉందని చెప్పారు. ప్రతీ అంశంపై చర్చిద్దామని మోడీ.. విపక్షాలకు సూచించారు. నిర్మాణాత్మక పద్దతిలో ప్రతీ అంశంపై చర్చ చేద్దామని చెప్పారు. నిన్న అఖిలపక్ష సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. అందులో కూడా హుందాగా ప్రవర్తిస్తామని ప్రధాని మోడీ సూచించారు. సభ గౌరవం పెంచేందుకు ప్రతీ ఒక్క సభ్యుడు కృషి చేయాలని కోరారు. 33 పార్టీలకు చెందిన 40 మందికి పైగా నాయకులు పాల్గొన్నారు.

కరోనా వైరస్, రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవకతవకలు, చైనాతో పరిస్థితులు, దేశంలో నిరుద్యోగం, ఆర్థిక పరిస్థితులు వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. సాగుచట్టాలపై రైతుల ఉద్యమం, కరోనా పరిస్థితులు, నిరుద్యోగం వంటి అంశాలు సమావేశాల్లో కీలకం కానున్నాయి. పెట్రో ఉత్పత్తుల ధరలపై ప్రతిపక్షాలు గట్టిగా నిలదీసే అవకాశం ఉంది. లోక్‌సభలో 17 బిల్లులను ప్రవేశ పెట్టేందుకు, 5 బిల్లులకు ఆమోదంపజేసుకునేందుకు, ఇదే సంఖ్యలో రాజ్యసభలో బిల్లులు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం భావిస్తోంది.












Click it and Unblock the Notifications