పెళ్లికి వెళ్లీ వ‌స్తుండ‌గా ఘోర రోడ్డు ప్రమాదం... 8 మంది సజీవ దహనం..

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో కారు ట్ర‌క్కు ఢీకొని 8 మంది స‌జీవ ద‌హ‌న‌మ‌య్యారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్న‌ట్లు తెలిసింది. బరేలీ జిల్లాలోని భోజిపురా జాతీయ ర‌హ‌దారిపై ఈ ప్రమాదం సంభ‌వించింది. శ‌నివారం రాత్రి స‌మ‌యంలో ఓ కారు, ట్ర‌క్కు ఢీకొన్నాయి. ప్ర‌మాదం ధాటికి కారులో మంట‌లు చెల‌రేగాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 8 మంది మంట‌ల్లోనే చిక్కుకుని కాలి బూడిద‌య్యారు.

పెళ్లికి హాజరైన ఓ కుటుంబం ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. హైవేపై వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొన్న‌ట్లు బరేలీ సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ సుశీల్ చంద్ర భాన్ ధులే తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత కారు డోర్లు తెరుచుకోకపోవడంతో అందులో ఉన్నవారు మంట‌ల్లో చిక్కుకుని కాలి బూడిద‌యిన‌ట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ మంట‌ల్లో ఎనిమిది మంది స‌జీవ ద‌హ‌నం అయ్యారు. చ‌నిపోయిన వారిలో ఓ చిన్నారి కూడా ఉన్న‌ట్లు తెలిసింది. ఈ ఘటన తర్వాత ట్రక్కు డ్రైవర్ పరారైనట్లు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.

atal road accident while going to the wedding... 8 people were burnt alive..

ప్ర‌మాదంలో కారు, ట్ర‌క్కు ద‌గ్ధ‌మ‌య్యాయి : జాతీయ ర‌హాదారిపై జ‌రిగిన ఈ ప్ర‌మాదంలో కారు సెంట్రల్‌ లాక్‌ పడటంతో అందులో ఉన్నవారు బయటకు రాలేకపోయారని స్థానికులు వివ‌రించారు. ఈ ప్రమాదం ధాటికి కారు, ట్రక్కు రెండు పూర్తిగా దగ్ధమ‌య్యాయి. బరేలీ నుంచి బహెడి వైపు నైనిటాల్ హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. జాతీయ రహదారిపై ప‌డిన ఈ టైర్ గుర్తులను చూస్తే, ట్రక్కు రోడ్డుపై దాదాపు 100 మీటర్ల మేర ఈడ్చుకెళ్లినట్లు కనిపిస్తోంది. ఇక కారు డోర్లు లాక్ కావడంతో అందులో నుంచి బయటికి రాకుండా బాధితులు చిక్కుకుపోయి మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంది.

స్థానికుల వివ‌రాల ప్ర‌కారం.. నాలుగు వాహనాల్లో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్ర‌మాదంలోని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా ఎలాంటి ఫలితం లేకపోయింద‌ని స్థానికులు వెల్ల‌డించారు. ప్రమాదంలో ద‌గ్ధ‌మ‌యిన కారు బహేరీలోని రాంలీలా మొహల్లాలో నివాసముంటున్న సుమిత్ గుప్తాకు చెందినదని నంబర్ ప్లేట్‌ ఆధారంగా తేలింద‌ని పోలీసులు తెలిపారు.ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే సరికి కారు సీట్లపై అస్థిపంజరాలను మాత్ర‌మే గుర్తించిన‌ట్లు స‌మాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+