మైనర్ ను అత్యాచారం చేసిన బ్యాడ్మింటన్ కోచ్.. మరో 8 మంది !

తల్లి, తండ్రి, గురువు, దైవం అంటూ జన్మనిచ్చిన వారి తర్వాత గురువుకే అంతటి గొప్ప స్థానాన్ని ఇస్తాం. కానీ విద్యా బుద్దులు నేర్పాల్సిన వారే కామంతో కళ్లు మూసుకుపోయి నీతిమాలిన పనులకు ఒడిగడుతున్నారు. టీచర్లు విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న ఘటనలు జరుగుతూనే ఉంటుండగా.. ఇప్పుడు బెంగళూరులో కూడా ఈ తరహా ఘటన చోటు చేసుకుంది. మైనర్ బాలికపై బ్యాడ్మింటన్ కోచ్ లైంగిక దాడికి పాల్పడడం తీవ్ర వివాదాస్పదంగా మారింది.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇటీవలే టెన్త్‌ క్లాస్‌ పరీక్షలు రాసిన బాలిక సెలవులు రావడంతో హుళిమావులోని అమ్మమ్మ ఇంటికి వచ్చింది. బాలిక 2 ఏళ్లుగా సురేశ్‌ బాలాజీ అనే బ్యాడ్మింటన్‌ కోచ్‌ వద్ద ఆట నేర్చుకుంటోంది. ఈ మేరకు తమిళనాడుకు చెందిన 26 ఏళ్ల సురేశ్ బెంగుళూరులోని కోచింగ్ సెంటర్ లో బాడ్మింటన్ కోచ్ గా పనిచేస్తున్నాడు. ఆట నేర్పించే నెపంతో బాలికను మభ్యపెట్టి పలుమార్లు బలవంతంగా లైంగిక దాడికి పాల్పడేవాడని.. ఎవరికై నా చెబితే హత్య చేస్తానని బెదిరించేవాడని ఆరోపిస్తున్నారు.

atrocity-in-kadapa-district-teacher-misbehaved-with-6th-grade-student

ఇటీవల బాలిక అమ్మమ్మ మొబైల్‌ ద్వారా నిందితునికి నగ్న చిత్రాలు, వీడియోలు పంపుతోంది. అయితే ఆమె అమ్మమ్మ గమనించి బాలికను నిలదీయడంతో పాటు ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని మొబైల్‌ ని పోలీసులు తనిఖీ చేయగా మరో 8 మంది బాలికల నగ్న ఫోటోలు, వీడియోలు లభ్యమయ్యాయి. దీంతో వారిని కూడా అత్యాచారం చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు.

మరోవైపు కోచ్‌ తనను కనీసం 25 సార్లు అతని గదికి తీసుకెళ్లాడని బాలిక విచారణలో వెల్లడించినట్టు సమాచారం. నిందితుడిని విచారిస్తే మరిన్ని నిజాలు బయటపడే అవకాశముందని అంటున్నారు. దీంతో ఈ వార్త సంచలనంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+