Aunty: తల్లితో ప్రియుడు ఫుల్ టైమ్, కూతురి మీద ? సర్దుకుపోవాలని కూల్ గా చెప్పిన తల్లి, ఇద్దరికి క్లైమాక్స్ !

చెన్నై: కుటుంబ సభ్యులు చూపించిన వ్యక్తిని వివాహం చేసుకున్న మహిళ భర్తతో సంతోషంగా కాపురం చేసింది. భార్య అడ్డదారిలో వెళ్లడంతో ఆమెకు భర్త వార్నింగ్ ఇచ్చాడు. చాలా కాలం పంచాయితీలు జరిగాయి. ఎవరు ఎన్ని చెప్పినా భార్య మాత్రం ఆమె తీరు మార్చుకోలేదు. అప్పటికే దంపతులకు ఓ కూతురు ఉండటంతో తన భార్య మారుతుందని ఆమె భర్త చాలా కాలం ఓపికగా ఉన్నాడు. రానురాను భార్య ఇంకా విచ్చలవిడాగా తయారు కావడంతో ఆమెకు భర్త విడాకులు ఇచ్చేశాడు. అప్పటికే ప్రియుడిని సెట్ చేసుకున్న భార్య అతనితో ఏకంగా ఓ ఇంటిలో కాపురం పెట్టేసింది. ప్రియురాలితో కాపురం చేస్తున్న ప్రియుడు కామంతో ఆమె కూతురి మీద కన్ను వేశాడు. ప్రియురాలు ఇంట్లో లేని సమయంలో ప్రియురాలి కూతురి మీద లైంగిక దాడి చేశాడు. చాలా కాలం నుంచి ఏమీ చెయ్యాలని పరిస్థితిలో ఓపికగా ఉన్న కూతురు జరిగిన విషయం ఆమె తల్లికి చెప్పింది. సర్దుకుపోవాలని కాని ఇలాంటి విషయాలు తల్లికి చెప్పకూడదు అని తల్లి చెప్పడంతో కూతురు షాక్ అయ్యింది. తల్లి ప్రియుడి చిత్రహింసలు తట్టుకోలేని అమ్మాయి పోలీసులను ఆశ్రయించింది. కూతురి మీద ప్రియుడు లైంగిక దాడి చేస్తే ప్రశ్నించాల్సిన తల్లి అక్రమ సంబంధం మోజులో అతనికే వత్తాసుపలికి ఇప్పుడు జైలుపాలైయ్యింది.

 విసిగిపోయిన భర్త

విసిగిపోయిన భర్త

చెన్నై సిటీలోని కొరట్టూరు రైల్వేస్టేషన్ సమీపంలో నరేష్ కుమార్ (44) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 17 సంవత్సరాల క్రితం ప్రియాంక (42) అనే మహిళను నరేష్ కుమార్ వివాహం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు చూపించిన నరేష్ కుమార్ ను వివాహం చేసుకున్న ప్రియాంక మొదట ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. రానురాను భార్య ప్రియాంక అడ్డదారిలో వెళ్లడంతో ఆమెకు భర్త నరేష్ కుమార్ వార్నింగ్ ఇచ్చాడు.

 కూతురి కోసం ఓపికగా ఉన్న భర్త

కూతురి కోసం ఓపికగా ఉన్న భర్త

చాలా కాలం నరేష్ కుమార్, ప్రియాంక దంపతుల మద్య పంచాయితీలు జరిగాయి. ఎవరు ఎన్ని చెప్పినా నరేష్ కుమార్ భార్య ప్రియాంక మాత్రం ఆమె తీరు మార్చుకోలేదు. అప్పటికే నరేష్ కుమార్, ప్రియాంక దంపతులకు కూతురు (15 సంవత్సరాలు) ఉంది. తన భార్య ప్రియాంక మారుతుందని ఆమె భర్త నరేష్ కుమార్ చాలా కాలం ఓపికగా ఉన్నాడు.

 భర్తకు గేట్ పాస్..... ప్రియుడికి ఎంట్రీ

భర్తకు గేట్ పాస్..... ప్రియుడికి ఎంట్రీ

రానురాను భార్య ప్రియాంక ఇంకా విచ్చలవిడాగా తయారు కావడంతో ఆమెకు నాలుగు సంవత్సరాల క్రితం నరేష్ కుమార్ విడాకులు ఇచ్చేశాడు. భర్త నరేష్ కుమార్ కు విడాకులు ఇచ్చేసిన ప్రియాంక అప్పటికే సందీప్ (37) అనే ప్రియుడిని సెట్ చేసుకుంది. భర్తతో విడిపోయిన ప్రియాంక తరువాత ప్రియుడు సందీప్ తో ఏకంగా ఓ ఇంటిలో కాపురం పెట్టేసింది. ప్రియాంతో పాటు ఆమె 15 ఏళ్ల కూతురు ఉంటోంది.

 ప్రియురాలి కూతురి మీద కామాంధుడి కన్నుపడింది

ప్రియురాలి కూతురి మీద కామాంధుడి కన్నుపడింది

ప్రియాంకతో కాపురం చేస్తున్న సందీప్ ఆమె 15 ఏళ్ల కూతురి మీద కన్ను వేశాడు. వయసుకు వచ్చిన కూతురు, ప్రియుడు సందీప్ ను ఇంట్లో వదిలేస్తున్న ప్రియాంక బయట తిరుగుతోంది. ప్రియురాలు ప్రియాంక ఇంట్లో లేని సమయంలో ఆమె ప్రియుడు సందీప్ ప్రియురాలి కూతురి మీద లైంగిక దాడి చెయ్యడం మొదలు పెట్టాడు.

 సర్దుకుపోవాలని కూల్ గా చెప్పిన తల్లి

సర్దుకుపోవాలని కూల్ గా చెప్పిన తల్లి

ప్రియాంక ఇంట్లో లేని సమయంలో ప్రియురాలి కూతురి మీద లైంగిక దాడి చేస్తున్న సందీప్ ఈ విషయం బయటకు చెబితే నిన్ను, మీ అమ్మను చంపేస్తానని బెదిరించాడు. చాలా కాలం నుంచి ఏమీ చెయ్యాలని పరిస్థితిలో ఓపికగా ఉన్న కూతురు జరిగిన విషయం ఆమె తల్లి ప్రియాంకకు చెప్పింది. సందీప్ విషయంలో నువ్వు సర్దుకుపోవాలని, ఇలాంటి విషయాలు తల్లికి చెప్పకూడదు అని ప్రియాంక చెప్పడంతో ఆమె కూతురు షాక్ అయ్యింది.

Recommended Video

    ఐరన్ లెగ్ కాదు గోల్డెన్ లెగ్ తెలుసుకోండిరా సన్నాసుల్లారా : రోజా || Oneindia Telugu
     జైల్లో కసాయి తల్లి, కామాంధుడు

    జైల్లో కసాయి తల్లి, కామాంధుడు

    తల్లి ప్రియాంక ప్రియుడి చిత్రహింసలు తట్టుకోలేని అమ్మాయి పోలీసులను ఆశ్రయించింది. విషయం తెలుసుకున్న మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ జ్యోతిలక్ష్మి అమ్మాయిని విచారణ చేసి పూర్తి సమాచారం సేకరించారు. కూతురి మీద ప్రియుడు సందీప్ లైంగిక దాడి చేస్తే ప్రశ్నించాల్సిన తల్లి ప్రియాంక అక్రమ సంబంధం మోజులోపడి అతనికే వత్తాసుపలికిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అమ్మాయి తల్లి ప్రియాంక, ఆమె ప్రియుడు సందీప్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. అమ్మాయిని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించి కేసు విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+