నోట్ల రద్దు: మోడీ అభిమాని ఆటో డ్రైవర్ సాధిక్ సాయం
న్యూఢిల్లీ: రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దు ప్రకటించి దాదాపు పది రోజులు అవుతోంది. నోట్ల మార్పిడికి జనాలు బ్యాంకులు, ఏటీఎంల వద్ద వరుస కడుతున్నారు.
హఠాత్తుగా పెద్ద నోట్ల రద్దు ప్రకటన రావడంతో ప్రజలు ఇబ్బంది పడటాన్ని గుర్తించిన ఓ మోడీ అభిమాని అయిన ఆటో డ్రైవర్ తన వంతు సాయంగా కొందరికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఆయన ఇప్పుడు అందరి అభిమానాలను చూరగొంటున్నారు.

నోట్లు మార్చుకోవడానికి, పాత కరెన్సీని డిపాజిట్ చేసేందుకు ప్రజలు పడిగాపులు కాస్తున్న విషయం తెలిసిందే. అందుకే సదరు ఆటో డ్రైవర్ సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఆ మోడీ అభిమాని పేరు సాధిక్.
డబ్బు డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి బ్యాంకుల వద్దకు వెళ్లే వారిని తన ఆటోలో ఉచితంగా సేవలు అందిస్తున్నాడు. కర్నాటకలోని మంగళూరుకు చెందిన సాధిక్.. ఆటో నడిపిస్తూ ఉపాధి పొందుతున్నాడు.
పెద్ద నోట్ల రద్దుపై కొందరు విమర్శలు చేస్తున్నారు. చాలామంది ప్రజలు మాత్రం స్వాగతిస్తున్నారు. ఆర్థిక వేత్తలు కూడా స్వాగతిస్తున్నారు. అయితే ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. చూడలేక మోడీ అభిమాని అయిన సాధిక్ తనకు చేతనైన సాయం చేయాలని భావించాడు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications