అనుమానం: భార్యను చంపి శవాన్ని సంచీలో కుక్కాడు
పూణే: వాట్స్అప్ హత్య కేసు చిక్కుముడిని విడదీసి పోలీసులకు సహకరించింది. ఖరాడీలో జూన్ 29వ తేదీన స్యూట్‌కేసులోని సంచీలో పోలీసులకు ఓ మహిళా శవం దొరికింది. ఆమెను గుర్తించడం పోలీసులకు సాధ్యం కాలేదు. దాంతో ఆన్‌లైన్‌లో శవం ఫొటోలను సర్క్యులేట్ చశారు. దాంతో విషయాలు తెలిసి యెరవాడ పోలీసులు మహిళ భర్తను అరెస్టు చేశారు
అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో తాను భార్యను చంపినట్లు ఆ వ్యక్తి అంగీకరించాడు. అతను ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మృతురాలు పూణే కంటోన్మెంట్‌లోని షాపింగ్ కాంప్లెక్స్‌లో సేల్స్ గర్ల్‌గా పనిచేస్తుండేది.

మృతురాలు అనురాధ గన్పత్ కులకర్ణి (21) లాతూరు జిల్లాకు చెందింది. ఆమె తన భర్త ప్రశాంత్ సూర్యవంశితో కలిసి ఘోర్పాడీలో నివసిస్తోంది. మృతురాలిని గుర్తించడం సాధ్యం కాకపోవడంతో ఫొటోను వార్తాపత్రికల్లో ప్రచురించారు. దాన్ని వాట్స్అప్‌లో, సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
అనురాధ సహోద్యోగి ఫొటోను వాట్స్‌అప్‌లో చూసి యెరవాడ పోలీసులను సంప్రదించారు. సహోద్యోగి అనురాధ వ్యక్తిగత వివరాలను కంటోన్మెంట్ పోలీసులకు చెప్పారు. వారు యెరవాడ పోలీసులను అప్రమత్తం చేశారు. దాంతో యెరవాడ పోలీసులు ప్రశాంత్‌ను మంగళవారంనాడు అరెస్టు చేశారు.
సంఘటన జరిగినప్పటి నుంచి ప్రశాంత్ సూర్యవంశి దాక్కుంటున్నాడని పోలీసులు చెప్పారు. చివరకు గుజరాత్‌లోని వడదొరాలో పోలీసులు పట్టుకున్నారు. అయితే, అధికారికంగా మంగళవారంనాడు పూణేలో అరెస్టు చూపించారు. సూర్యవంశి హత్య చేసిన విషయాన్ని అంగీకరించాడు.












Click it and Unblock the Notifications