Axis My India exit polls: మహారాష్ట్రలో ఎన్డీఏకు తిరుగులేదు, ఎంవీఏకి ఎన్ని సీట్లంటే?

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. ఈ క్రమంలో పలు మీడియా సంస్థలు, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ తిరిగి ఎన్డీఏ ప్రభుత్వమే మహారాష్ట్రలో కొలువుదీరుతుందని పేర్కొన్నాయి. తాజాగా, యాక్సెస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ కూడా అదే విషయాన్ని తేల్చాయి. అయితే, సర్వే కూడా ఎన్డీఏ కూటమికి అత్యధిక స్థానాలు కట్టబెట్టింది.

యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. మహారాష్ట్రలో ఎన్డీఏకు 150-170 అసెంబ్లీ స్థానాలు దక్కుతాయని వెల్లడించింది. ఇక ఇండియా(ఎంవీఏ) కూటమికి 110-130 వరకు సీట్లు వస్తాయని తెలిపింది. ఇతరులకు 8-10 సీట్లు దక్కే అవకాశం ఉందని పేర్కొంది. యాక్సెస్ మైఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. ఎన్డీఏ కూటమి మహారాష్ట్రలో తిరిగి అధికారంలోకి వస్తుందని తేలిపోయింది.

Axis My India exit polls NDA back in power in Maharashtra MVA lagging behind

ఇక, మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఎన్డీఏ కూటమి వైపే మొగ్గు చూపాయి. ఆ వివరాలను గమనిస్తే.. పీ మార్క్ సర్వే ప్రకారం.. ఎన్డీఏ కూటమికి 137-157 సీట్లు, ఎంవీఏ కూటమికి 126-146 సీట్లు, ఇతరులకు 2-8 సీట్లు వస్తాయని తెలిపింది. దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. ఎన్డీఏకు 125-140 సీట్లు, ఎంవీఏకు 135-150 సీట్లు, ఇతరులకు 20-25 సీట్లు వస్తాయని పేర్కొంది.

చాణక్య స్ట్రాటజీస్:

ఎన్డీఏ: 152-160 సీట్లు
ఎంవీఏ: 130-138 సీట్లు
ఇతరులు: 6-8

పీపుల్స్ పల్స్:
ఎన్డీఏ: 175-195 సీట్లు
ఎంవీఏ: 85-112 సీట్లు
ఇతరులు: 7-12

మ్యాట్రిట్జ్:

ఎన్డీఏ: 150-170 సీట్లు
ఎంవీఏ: 110-130 సీట్లు
ఇతరులు: 8-10

లోక్షహి మరాఠి రుద్ర:

ఎన్డీఏ: 128-142 సీట్లు
ఎంవీఏ: 125-140 సీట్లు
ఇతరులు: 18-23 సీట్లు

పోల్ డైరీ:

ఎన్డీఏ: 122-186 సీట్లు
ఎంవీఏ:69-121
ఇతరులు: 12-29

ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అధికారంలోని ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఉన్నాయి. అయితే, అసలైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నవంబర్ 23న వెలువడనున్నాయి. మహారాష్ట్రలో అధికారం కోసం ఎన్డీఏ(మహాయుతి) కూటమి, ఎంవీఏ(ఇండియా కూటమి) నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+