• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Ayodhya Case: సుప్రీంకోర్టులో ముగిసినవాదనలు.. బుధవారం నాటి కంప్లీట్ అప్‌డేట్స్

|

న్యూఢిల్లీ: అయోధ్య భూవివాదం కేసులో చివరి వాదనలు సుప్రీంకోర్టులో ముగిశాయి. ఇప్పటికే 39 సార్లు అయోధ్య రామమందిరం బాబ్రీమసీదు భూవివాదంలో కోర్టు వాదనలు వినింది. ఇక చివరి సారిగా అంటే 40వ సారిగా అత్యున్నత న్యాయస్థానం వాదనలు బుధవారం వినింది. దీంతో ఇక అయోధ్య భూవివాదంలో సుప్రీంకోర్టు కేవలం తీర్పు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. తీర్పును అత్యున్నత న్యాయస్థానం రిజర్వ్‌లో ఉంచింది. తీర్పుచీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీవిరమణ పొందేలోగా వస్తుందని భావిస్తున్నారు.

అయోధ్య భూవివాదం కేసును చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేస్తోంది. ఆగష్టు 6 నుంచి రోజువారీగా ఈ విచారణను ఈ బెంచ్ చేపడుతోంది. 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పలు హిందూ సంఘాలు ముస్లిం సంఘాలు పిటిషన్లు దాఖలు చేశాయి. 2.77 ఎకరాల స్థలంను ఆలయ ప్రధాన పూజారి రామ్‌లల్లా, నిర్మోహి అఖారా, సున్నీ వక్ఫ్‌బోర్డులకు సమానంగా పంచాలని 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. దీన్ని సవాలు చేస్తూ 2011లో సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇక అప్పటి నుంచి కోర్టులోనే కేసు మగ్గుతూ వస్తోంది.

Ayodhya Case Final Hearing Live Updates:Hearings enter the last day in SC

1992 డిసెంబర్ 6వ తేదీన 16వ శతాబ్దం నాటి బాబ్రీ మసీదును కూల్చివేయడం జరిగింది. ఇక అప్పటి నుంచి ఈ వివాదం హిందూ ముస్లింల మధ్య గొడవగా మారింది. అయితే అత్యున్నత న్యాయస్థానం మాత్రం అక్టోబర్ 17న వాదనలు వినేందుకు చివరిరోజని ప్రకటించింది. ఇక తీర్పు నవంబర్ 4 లేదా 5వ తేదీల్లో వెలువడే అవకాశం ఉంది.

Newest First Oldest First
4:54 PM, 16 Oct
వాదనలు సంతృప్తికరంగా ముగిశాయి.. తీర్పు తమకే అనుకూలంగా వస్తుందని ఆశిస్తున్నాం: ముస్లిం పార్టీల తరపున లాయర్ జఫర్యాబ్ జిలానీ
4:31 PM, 16 Oct
అనుకున్న సమయం కంటే రెండురోజుల ముందే అయోధ్య కేసులో వాదనలను ముగించిన సుప్రీంకోర్టు. అక్టోబర్ 18న ముగియాల్సి ఉన్న వాదనలు. మిగతావి మరో మూడురోజుల్లో రాతపూర్వకంగా సమర్పించాలని కోరిన సుప్రీంకోర్టు
4:30 PM, 16 Oct
అయోధ్య కేసులో తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు
4:30 PM, 16 Oct
1992లో బాబ్రీ మసీదు కూల్చివేత సందర్భంగా ముస్లింలు నష్టపోయారు..ఇక మసీదు పునర్నిర్మాణం చేపట్టేందుకు ముస్లింలకు మాత్రమే అధికారం ఉంటుంది: రాజీవ్ ధవన్
4:28 PM, 16 Oct
నవంబర్ 30 వరకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నతాధికారులకు సెలవు రద్దు, అయోధ్యలో హైఅలర్ట్
3:58 PM, 16 Oct
టీవీ చర్చల సందర్భంగా అతివాద అభిప్రాయలకు తావులేకుండా చూడాలని NBSA ఆదేశం
3:57 PM, 16 Oct
సంబరాలు కూడా టెలికాస్ట్ చేయరాదని చెప్పిన NBSA
3:57 PM, 16 Oct
మసీదు కూల్చే దృశ్యాలను టెలికాస్ట్ చేయరాదని చెప్పిన NBSA
3:56 PM, 16 Oct
కోర్టు ప్రొసీడింగ్‌లపై అత్యుత్సాహం ప్రదర్శించరాదని చెప్పిన NBSA
3:56 PM, 16 Oct
వాదనల సమయంలో న్యూస్ బ్రాడ్‌కాస్టింగ్ స్టాండర్డ్ అథారిటీ (NBSA) కొన్ని నిబంధనలను పాటించాలని సూచించింది.
3:54 PM, 16 Oct
భగవంతుడిని బాబర్‌కు అంటగట్టరాదు, బాబర్ చట్టాలకు లోబడని వ్యక్తి: రాజీవ్ ధవన్
3:52 PM, 16 Oct
భూమి హిందువులకే చెందుతుందన్న మిశ్రా వాదనను తప్పుబట్టిన ధవన్.. మిశ్రా వాదనలో పసలేదన్న ధవన్
2:54 PM, 16 Oct
హిందూమహాసభ వాదనల్లో నిజాయితీ లోపించింది: రాజీవ్ ధవన్
2:54 PM, 16 Oct
హిందూ మహాసభ ఎనిమిది సాక్ష్యాలను చూపిస్తోందని అందులో నాలుగు సాక్ష్యాలు ఒకదానితో ఒకటికి పొంతన లేదని కోర్టుకు తెలిపారు రాజీవ్ ధవన్
2:50 PM, 16 Oct
ధవన్‌కు పేజీలను చింపేయాల్సిందిగా తానే చెప్పినట్లు అంగీకరించిన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్
2:49 PM, 16 Oct
తాను పుస్తకంలోని పేజీలను చింపివేసినట్లు బయట ప్రచారం జరుగుతోంది. కానీ పేజీలను విసిరేయాలని చూశాను. అయితే చీఫ్ జస్టిస్ చింపేయాల్సిందిగా చెప్పారు. అందుకే కోర్టు అనుమతితోనే పేజీలను చింపేశాను: రాజీవ్ ధవన్
2:48 PM, 16 Oct
హిందూ మహాసభ ఒక స్పష్టమైన వైఖరితో లేదు: రాజీవ్ ధవన్
2:41 PM, 16 Oct
ఇప్పటి వరకు విత్‌డ్రా చేసుకుంటున్నట్లు కోర్టులో ఎలాంటి అప్లికేషన్ దాఖలు కాలేదు: సున్నీ వక్ఫ్ బోర్డు లాయరు జఫర్యాబ్ జిలానీ
2:37 PM, 16 Oct
హిందూ మహాసభ స్టాండ్ ఏమిటని ప్రశ్నించిన రాజీవ్ ధవన్
2:32 PM, 16 Oct
1850కి ముందు వివాదాస్పద ప్రాంతంలో నమాజ్ జరగలేదు అని చెబుతూ వచ్చిన పుస్తకాలను కోర్టుకు సమర్పించిన మిశ్రా
2:31 PM, 16 Oct
1856కు ముందు భూమి తమదే అని చెప్పేందుకు ముస్లిం పార్టీల వద్ద ఎలాంటి ఆధారాలు లేవని కోర్టుకు చెప్పిన హిందూ పార్టీల తరపున లాయర్ మిశ్రా
2:26 PM, 16 Oct
తన వాదనలు వినిపించేందుకు కోర్టు అనుమతి కోరిన సుబ్రహ్మణ్యన్ స్వామి
2:20 PM, 16 Oct
శ్రీరాముడు నడియాడిన నేల తప్పకుండా తిరిగి వస్తుందనే పూర్తి నమ్మకం మాకుంది: రామాలయం అర్చకుడు
2:17 PM, 16 Oct
భోజన విరామం తర్వాత సుప్రీం కోర్టులో అయోధ్యపై వాదనలు ప్రారంభం
2:07 PM, 16 Oct
ముస్లిం పార్టీల తరపున వాదనలు వినిపిస్తున్న లాయర్ పుస్తకాన్ని కోర్టులో చించివేశారంటే కేసు ఓడిపోయినట్టే అని భావించాల్సి ఉంటుంది: కిషోర్ కునాల్
2:06 PM, 16 Oct
అయోధ్య పై తనకు పూర్తి అవగాహన ఉందన్న అయోధ్య రీ విజిటెడ్ రచయిత మాజీ ఐఏఎస్ అధికారి కిషోర్ కునాల్
12:33 PM, 16 Oct
భోజన విరామం ఇచ్చిన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్
12:20 PM, 16 Oct
రాజీవ్ ధవన్ చించివేసిన పేజీల్లో శ్రీరాముడు జన్మించిన స్థలంకు సంబంధించిన మ్యాప్‌ ఉంది
12:18 PM, 16 Oct
ఇక వాదనలు ముగిశాయని నేను భావిస్తున్నాను..ఇక అందరం లేచి వెళదామన్న సీజేఐ రంజన్ గొగోయ్
12:16 PM, 16 Oct
వికాస్ సింగ్ సమర్పించిన పుస్తకంలోని కొన్ని పేజీలను చించివేసిన ముస్లిం పార్టీల తరపున లాయర్ రాజీవ్ ధవన్
READ MORE

English summary
Chief Justice of India Ranjan Gogoi said that Wednesday would be the last hearing and the 40th hearing on Ayodhya land dispute case. With this all hearings pertaining to the case shall be closed and the judgement would be reserved for November.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more