Ayodhya: జనవరి 15 నుంచి 22వరకు అయోధ్య ప్రాణప్రతిష్ట ఉత్సవాలు..
భారత్‌లోని హిందువులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అయోధ్యలోని శ్రీరామ ఆలయం ఎట్టకేలకు ప్రారంభం కానుంది. ఈ ఆలయ ప్రారంభానికి అద్భుతమైన ముహుర్తాన్ని కూడా ఖరారు చేశారు. ఈ నెల 22న అయోధ్య శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట ప్రారంభం కానుంది. అందుకోసం వారం రోజుల ముందు నుంచే అయోధ్య రామాలయ ప్రారంభ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. జనవరి 15వ తేది నుంచి 22 వరకు అయోధ్య ప్రాణప్రతిష్ట ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.
ఈనెల 15 నుంచి అయోధ్య రామాలయంలో యఙ్ఞ క్రతువులు ప్రారంభమవుతున్నాయి. జనవరి 15న సంక్రాంతితో అశుభ కాలం ముగుస్తుంది. ఆ ఘడియల్లో రాముడి విగ్రహాన్ని యాగశాల మండపంలోకి తీసుకురావడం జరుగుతంది. మరుసటి రోజు అంటే జనవరి 16వ తేదీన కనుమ నాడు అయోధ్య బలరాముని విగ్రహానికి ప్రతిష్ఠాపన ప్రారంభిస్తారు. ఈ ప్రతిష్ఠాపనలో భాగంగానే బ్రాహ్మణులు దీక్షను స్వీకరిస్తారు. జనవరి 17 వతేదీ ముక్కనుమ నాడు శ్రీరాముని విగ్రహాన్ని ఊరేగిస్తారు. ఆ రోజే అయోధ్య రామమందిరంలో ప్రతిష్టంచునున్న రాముని విగ్రహాన్ని ప్రపంచం చూడనుంది. ఇక, ఈ నెల 18వ తేదీన మండప ప్రవేశ పూజ, వాస్తు పూజ, వరుణ పూజ, గణేశ పూజ వంటి పూజలు నిర్వహించనున్నారు. జనవరి 19న అయోధ్య రామ మందిరంలో యజ్ఞ అగ్ని గుండాన్ని స్థాపించనున్నారు. జనవరి 20న వివిధ నదుల నుంచి సేకరించిన నీటితో గర్భగుడిని పవిత్రం చేయనున్నారు.

అద్భుతమైన ముహుర్తంలో అయోధ్య రాముని ప్రతిష్టాపన :ఇక, ఈనెల 21 వ తేదీన జలాధివాసం చేస్తారు. జలాధివాసం అంటే యజ్ఞం చేసిన తర్వాత ప్రత్యేక పూజల మధ్య అయోధ్య శ్రీరాముని విగ్రహాన్ని125 కలశాలతో అభిషేకం చేస్తారు. జనవరి 22న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంలోని ప్రధాన కార్యక్రమం అయిన రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది. జనవరి 22న మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకనుల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల మధ్య 84సెకన్ల పాటు రాముడి విగ్రహాన్న అయోధ్య గర్భగుడిలో స్థాపించనున్నారు. ఇది అత్యంత అద్భుతమైన ముహుర్తంగా పరిగణించారు. జనవరి 24 వ తేదీ నుంచి అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు భక్తులకు అనుమతినిచ్చారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications