Ayodhya Record: ప్రాణప్రతిష్టకు ముందే వరల్డ్ రికార్డు దిశగా అయోధ్య- ఎందులోనో తెలుసా ?

అయోధ్యలో రామాలయ నిర్మాణం వేగంగా పూర్తవుతోంది. ఈ నెల 22న ఆలయంలో రాముడితో పాటు ఇతర విగ్రహాల ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగబోతోంది. ఈ నెల 16 నుంచే ఆలయంలో సంప్రదాయ కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. దీంతో అయోధ్య ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటోంది. అయితే అంతకు ముందే అయోధ్య మరో అంశలో వరల్డ్ రికార్డు సృష్టించేందుకు సిద్ధమవుతోంది.

అయోధ్యలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నగర వ్యాప్తంగా ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం భారీ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా నగర వ్యాప్తంగా భారీ సోలార్ సైట్లను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సోలార్ లైట్లు వరల్డ్ రికార్డు సృష్టించే దిశగా సాగుతున్నాయి. ప్రపంచంలోనే అతి పొడవైన సౌర లైట్ల వరుస ఏర్పాటు చేయడం ద్వారా ఈ వరల్డ్ రికార్డు కోసం యూపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

Ayodhya is all set for world record for longest line of solar lights

ఇప్పటివరకూ సౌదీ అరేబియాలోని మల్హామ్ లో మూడేళ్ల క్రితం 9.7 కిలోమీటర్ల పొడవున ఏర్పాటు చేసిన 468 సోలార్ లైట్లే వరల్డ్ రికార్డుగా ఉండేవి. ఇప్పుడు ఆ రికార్డును అయోధ్య అధిగమించబోతోంది. అయోధ్యలో ఇప్పుడు 10.2 కిలోమీటర్ల పొడవున 470 సోలార్ లైట్లను ఏర్పాటు చేస్తున్నారు. గుప్తార్ ఘాట్ నుంచి లక్ష్మణ్ ఘాట్ వరకూ వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇది పూర్తయితే వరల్డ్ రికార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు యోగీ సర్కార్ సిద్దమవుతోంది.

Ayodhya is all set for world record for longest line of solar lights

జనవరి 22కు ముందే ఈ సోలార్ లైట్ల వరుస పనిచేయడం ప్రారంభిస్తుందని అధికారులు ఆశాభావంగా ఉన్నారు. ఇప్పటికే ఈ 470 లైట్లలో 310 లైట్లను పెట్టడం పూర్తయింది. ఈ లైట్ ఒక్కోటి 4.4 వాట్ల సామర్ధ్యం కలిగి ఉందని అధికారులు చెప్తున్నారు. అయోధ్యలో ఏర్పాటు చేసిన పునరుత్పాదక శక్తి గ్రిడ్ కు వీటిని అనుసంధానిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+