అయోధ్య రామయ్యకు ప్రపంచంలోనే అత్యంత పొడవైన వేణువు కానుకగా సమర్పించిన ముస్లిం కుటుంబం!!

అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవ, విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని వీక్షించటం కోసం దేశం అంతా సిద్ధమైంది. అయ్యోధ్య రామయ్య కొలువుతీరే మధుర క్షణాలను చూసే భాగ్యం కోసం రామ భక్తులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయోధ్య రామయ్యకు ఉడుతా భక్తిగా ఎవరికి వారు తమకు తోచింది పంపుతున్నారు. ఇప్పటికే రామయ్యకు దేశ వ్యాప్తంగా కానుకల వరద కురుస్తుంది.

ఎవరూ ఊహించని విధంగా అయోధ్య రామయ్యకు కానుకల వర్షం కురుస్తుంది. అత్యంత భక్తి భావంతో హిందువులు మాత్రమే కాదు ముస్లింలు కూడా రామయ్యకు కానుకలు పంపుతున్నారు. తాజాగా అయోధ్య రామయ్యకు 21.6 అడుగుల పొడువున్న వేణువును ఫిలిబిత్‌కు చెందిన ఓ ముస్లిం కుటుంబం కానుకగా పంపిస్తుంది. 21.6 అడుగుల పొడవున్న ఈ వేణువును ఫిలిబిత్‌ నుంచి అయోధ్యకు తరలించనున్నారు.

Ayodhya ram mandir: A Muslim family gifted worlds longest flute to ayodhya lord sri ram!!

ఫిలిబిత్ కు చెందిన ప్రముఖ హస్త కళాకారుడు నవాబ్ అహ్మద్ భార్య హీనా పర్వీన్, అతని కొడుకు అర్మాన్ నబీ, అతని స్నేహితులతో కలిసి ఈ వేణువును తయారు చేశారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కు చెందిన హరీష్ రౌతేలా ఆ వేణువుకు పూజలు చేశారు. ఈనెల 26వ తేదీన ఈ వేణువును అయోధ్య రామ మందిరానికి పంపించనున్నారు.

అయోధ్య రామయ్య కోసం తయారు చేసిన ఈ వేణువు ప్రపంచంలోనే అత్యంత పొడవైన వేణువుగా నిలవనుంది. ఈ వేణువు అసోం కు చెందిన వెదురు కర్రతో తయారు చేసినట్టు వారు చెప్పారు. 20 ఏళ్ల కిందట సేకరించిన ఈ వెదురు కర్ర అయోధ్య రామయ్య కు కానుకగా ఉపయోగపడుతుందని అనుకోలేదని వారు అంటున్నారు.

ఈ వేణువు 3.5 అంగుళాలు ఉండగా 21.6 అడుగుల పొడవు ఉంది. ఈ వేణువును తయారు చేయడానికి పది రోజుల సమయం పట్టింది. ఈ వేణువుతో రెండువైపులా గానం చేయొచ్చని చెబుతున్నారు. ఈ వేణువు తయారీకి 70 నుండి 80 వేల రూపాయల ఖర్చయిందని చెబుతున్నారు. ఈ వేణువును అయోధ్యకు చేరిస్తే మ్యూజియంలో భద్రపరచనున్నారని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+