Ayodhya ram mandir: అయోధ్యకు ఆహ్వానాలు అందుకున్న రాజకీయ ప్రముఖులు వీరే!!
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంతో కోట్లాదిమంది రామభక్తుల కల సాకారం కానుంది. ఈనెల 22వ తేదీన అత్యంత వైభవోపేతంగా బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి వేలాది సంఖ్యలో ప్రముఖులు హాజరు కానున్నారు. రాజకీయ వర్గాల నుండి, సినీ పరిశ్రమ నుండి, ఇప్పటికే పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందగా, వారంతా అయోధ్యకు తరలి వెళ్తున్నారు.
శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించి అద్భుతమైన ఘట్టాన్ని తిలకించేందుకు యావత్ భారతదేశం వేయి కళ్ళతో ఎదురు చూస్తోంది. ఇక అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి దేశంలోని అనేక మంది ప్రముఖులను ఆహ్వానించిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ రాజకీయ ప్రముఖులకు సైతం ఆహ్వానాలను పంపింది.

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానాలు అందుకున్న రాజకీయ ప్రముఖుల విషయానికి వస్తే.. లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్, చంద్రబాబు, కెసిఆర్, గవర్నర్లు, కేంద్రమంత్రులు, అన్ని రాష్ట్రాల సీఎంలు తదితర ప్రముఖులు ఉన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, బీహార్ సీఎం నితీష్ కుమార్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి తదితరులకు ఆహ్వానం అందింది.
హెచ్డీ దేవగౌడ, బిజెపి కురువృద్ధుడు ఎల్కే అద్వానీ, బిజెపి నేత మురళీ మనోహర్ జోషి, హిమాచల్ ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్య సింగ్ తదితరులు ఆహ్వానం అందుకున్న వారిలో ఉన్నారు. అయితే అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్టకు కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉండాలని నిర్ణయించింది. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఇచ్చిన ఆహ్వానాన్ని సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి తిరస్కరించారు.
అయోధ్య ఆలయ ప్రారంభోత్సవం పూర్తిగా ఆర్ఎస్ఎస్, బిజెపి కార్యక్రమం అని ఈ కార్యక్రమాన్ని మోడీ సర్కారు పొలిటికల్ ప్రాజెక్టుగా మార్చిందని, కేవలం ఎలక్షన్ స్టంట్ లో భాగంగా ఆలయ నిర్మాణం పూర్తికాకుండానే ఆలయాన్ని ప్రారంభిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి తాము రామని కాంగ్రెస్ పార్టీ తేల్చి చెప్పింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications