Ayodhya : అయోధ్య బాలరాముడి అలంకరణ జాబితా ఇదే..
జనవరి 22న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ట వేడుక ఎంతో వైభవంగా జరిగింది. అయోధ్యలోని రామ్ లల్లా విగ్రహాన్ని ఎంతో అందంగా ముస్తాబు చేస్తారు. ఈ విగ్రహాన్ని మైసూరుకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించడం జరిగింది. ఆధ్యాత్మిక శోభ, సాంప్రదాయం ప్రకారం దైవిక ఆభరణాలు, ప్రత్యేక వస్త్రాలతో అయోధ్య శ్రీరాముని విగ్రహం ముస్తాబయ్యింది. అయోధ్య శ్రీరాముని ఆభరణాలను లక్నోలోని 'శ్రీ అంకుర్ ఆనంద్ సంస్థ'కు చెందిన 'హర్షహైమల్ షియామ్‌లాల్ జ్యువెలర్స్ వారు తయారుచేసిట్లు అయోధ్య ట్రస్టు పేర్కొంది.
అయోధ్య వేడుక సందర్భంగా రాములోరు పసుపు ధోతీ, ఎరుపు రంగు పతాక/అంగవస్త్రంతో రామ్ లల్లాను అలంకరించడం జరిగింది. ఈ అంగవస్త్రాలను స్వచ్ఛమైన బంగారు జరీ, దారాలతో తయారుచేయడం జరిగింది. అయోధ్యలోని రాములోరి ధరించిన దుస్తులపై శంఖం, పద్మం, చక్రం, మయూర్ వంటి వైష్ణవ చిహ్నాలు ముద్రించి ఉంటాయి. ఈ దుస్తులను ఢిల్లీ టెక్స్‌టైల్ డిజైనర్ శ్రీ మనీష్ త్రిపాఠి తయారుచేశారు.

అయోధ్యలో శ్రీరాముడు ధరించిన ఆభరణాలు ఓసారి చూద్దాం రండి : అయోధ్యలోని రామ్‌లల్లా ఎడమ చేతిలో ముత్యాలు, కెంపులు, పచ్చలతో అలంకరించిన బంగారు ధనుస్సు ఉంటుంది. ఇక, కుడి చేతిలో బంగారు బాణం అలంకరించి ఉంటుంది. బాలరాముని మెడ చుట్టూ ప్రత్యేక నగలు అలంకరించి ఉంటాయి. బాల రాముడి నుదుటిపై వజ్రాలు, కెంపులతో తయారు చేసిన సాంప్రదాయక, పవిత్రమైన తిలకాన్ని అద్దడం జరగింది. ఇక, బాలరాముని పాదాల కింద కమలం, దాని కింద బంగారు దండ అమర్చబడ్డాయి. అయోధ్యలోని శ్రీరాముని విగ్రహం బాలరాముడిది కాబట్టి వెండితో తయారు చేసిన సాంప్రదాయ బొమ్మలు ఆయన ముందు ఆసీనులై ఉంటాయి. ఈ బొమ్మల్లో గిలక్కాయలు, ఏనుగు, గుర్రం, ఒంటె, బొమ్మల బండి, స్పిన్నింగ్ వంటివి ఉన్నాయి. అయోధ్య శ్రీరామునికి తలపై బంగారు గొడుగును అమర్చడం జరిగింది.
విజయమాల : ఇవన్నీ అభరణాలతో పాటు బాలరామునికి బంగారంతో తయారు చేసిన విజయమాలను కూడా అలంకరించారు. ఈ విజయమాలను కెంపులతో పొదిగించారు. దీనిని విజయానికి చిహ్నంగా ధరిస్తారు. వీటిలో వైష్ణవ సాంప్రదాయ చిహ్నాలైన సుదర్శన చక్రం, కమలం, శంఖం, మంగళ కలశం ముద్రించి ఉన్నాయి. వీటితోపాటు అయోధ్య శ్రీరాముడు రెండు చేతులతో పట్టుకున్న ఆయుధాలకు కూడా ఎంతో ప్రత్యేకం ఉంది.

ఎందుకంటే ఈ ఆయుధాలను బంగారం, విలువైన రాళ్లతో తయారుచేశారు. ఇంకా, అందమైన రత్నాలు పొదిగిన గాజులను కూడా బాలరాముని రెండు చేతులకు తొడిగారు. వీటితోపాటు ఉంగరాలు. రత్నాలతో అలంకరించిన ఉంగరాలు. రెండు చేతులకు వేలాడుతున్న ముత్యాలు. బాలరాముని పాదాల, బొటనవేళ్లకు అలంకరించిన ఆభరణాలు కూడా ఎంతో విలువైనవి. వీటిని ఛడ లేదా ఫైంజనియా అంటారు. వీటిని బంగారం, వజ్రాలు, కెంపులతో తయారుచేయడం జరిగింది.
రత్నాలతో పొదిగి ఉన్నకర్ధాని : అయోధ్యలోని బాలరామునికి రత్నాలతో పొదిగి ఉన్న కర్ధానిని కూడా ధరించారు. ఇది బాలరాముడి నడుము చుట్టూ రత్నాలు పొదిగి ఉన్న నగ. సహజత్వం ఉట్టిపడే విధంగా దీనిని బంగారంతో తయారు చేయడం జరిగింది. ఈ నగను వజ్రాలు, కెంపులు, ముత్యాలు, పచ్చలతో అలంకరించారు. వీటిలో చిన్న గంటలు, ముత్యాలు, కెంపులు, పచ్చలు వేలాడుతూ ఉంటాయి. ఇవి స్వచ్ఛతకు ప్రతీకగా నిలుస్తాయి.












Click it and Unblock the Notifications