అందరికీ హెల్త్ ఐడీ కార్డులు: ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రారంభించిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మరో ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించారు. దేశ పౌరుల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా సోమవారం సరికొత్త పథకాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. సోమవారం ఉదయం 11గంటలకు ప్రధాని కార్యాలయంలో జరిగే వర్చువల్‌ ఈవెంట్‌లో ప్రధాని మోడీ ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ పథకాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు వీలుగా 'ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్' పేరుతో ఈ కార్యక్రమం చేపట్టనున్నామని గత ఏడాది ఆగస్టు 15న ఎర్రకోట నుంచి ప్రధాన మంత్రి ప్రకటించారు. ప్రస్తుతం.. ఈ కార్యక్రమం పైలట్ దశలో ఆరు కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేయనున్నారు.

Ayushman Bharat Digital Mission: PM Narendra Modi launches health ID for all

కాగా, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ లో దేశంలోని ప్రతీ పౌరుడికీ హెల్త్ కార్డుల జారీతో పాటు వారి ఆరోగ్య సమాచారాన్ని ఆ కార్డులో నిక్లిప్తం చేయనున్నారు. పైలెట్ ప్రాజెక్ట్‌గా ప్రస్తుతం 6 కేంద్ర పాలిత ప్రాంతాలు అండమాన్ అండ్ నికోబార్, చండీగఢ్, దాద్రా-నాగర్‌హవేలీ , డామన్- డయు, లడఖ్, లక్షద్వీప్ - పుదుచ్చేరిలలో టెస్ట్ రన్ చేయనున్నారు. ఈ పథకంలో భాగంగా దేశ ప్రజలకు హెల్త్‌ కార్డ్‌లతో పాటు హెల్త్‌ ఐడీలను అందించనున్నారు. వీటి ఆధారంగా ప్రజలు హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ను ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ వెబ్‌ సైట్‌(health id.ndhm.gov.in)లో అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది.

ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ కింద దేశంలోని పౌరులందరికీ హెల్త్ కార్డులతో పాటు హెల్త్ ఐడీ కూడా అందివ్వడం జరుగుతుంది. దీని ఆధారంగా ప్రతీ ఒక్కరి ఆరోగ్య సమాచారాన్ని అందులో పొందుపరుస్తారు. దీంతో ఎఎవరైనా అనారోగ్య సమస్యలతో ఆస్పత్రికి వెళ్లినా, లేదంటే ట్రీట్మెంట్‌ రికార్డ్‌లను పోగొట్టుకున్నా.. చికిత్స అందించాల్సి వస్తే.. మెడిసిన్స్ తీసుకోవాల్సి వచ్చినా వెంటనే ఈ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఎవరైనా ఏదైనా ఆస్పత్రికి వెళ్లినప్పుడు తమ హెల్త్ ఐడీ నమోదు చేయగానే ఆటోమేటిక్‌గా ఆ రోగి పూర్తి ఆరోగ్య సమాచారం డాక్టర్లకు కనిపిస్తుంది. ఒకవేళ కొత్త పరీక్షలు చేయాల్సి వస్తే ఆ వివరాలను ఇందులో పొందుపరచాల్సి ఉంటుంది. సంబంధిత సమాచారం ఈ వెబ్‌‌సైట్‌లో భద్రంగా ఉంటుంది. కనుక ఆస్పత్రికి వెళ్లి హెల్త్‌ ఐడి చెబితే సరిపోతుంది. కాగా, ఇలాంటి సదుపాయం పలు దేశాల్లో అందుబాటులో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+