Adipurush: ఆదిపురుష్ సినిమాను బ్యాన్ చేయాల్సిందే.. మూవీపై పెరుగుతోన్న వ్యతిరేకత..!
ఆదిపురుష్ సినిమా చుట్టు వివాదాలు రాజుకుంటున్నాయి. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని.. ఈ సినిమాలోని రావణుడు, రాముడు, సీతాకు సంబంధించిన కొన్ని 'అభ్యంతరకర సన్నివేశాలను' తొలగించాలని కోరుతూ హిందూ సేన జాతీయ అధ్యక్షుడు ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆదిపురుష్ సినిమాను బ్యాన్ చేయండని కొందరు డిమాండ్ చేస్తున్నారు.
ఇందుకు సంబంధించి.. ఆల్ ఇండియా సినిమా వర్కర్లు ఇప్పటికే ప్రధాని మోడీకి లేఖ రాశారు. మంగళవారం ఈ సినిమాకు వ్యతిరేకంగా హరిద్వార్, ఢిల్లీలోని మల్టీఫ్లెక్స్ ధియేటర్లలో భజరంగ్ దళ్, ఇతర హిందూ సంఘాలు ఆందోళన చేశారు. సినిమా చూస్తున్న సమయంలోనే.. మధ్యలో లేచి లొల్లి చేశారు. ఆదిపురుష్ సినిమాపై బ్యాన్ విధించాలని.. ఎక్కడా ప్రదర్శించకుండా చూడాలని డిమాండ్ చేశారు.

ఈ సినిమాలో హనుమంతుడి పాత్రదారుడి చేత కొన్ని అసభ్య పదాలను పలికించారని.. ఇది వాల్మికి రామాయణానికి పూర్తిగా విరుద్ధమన్నారు.రాముడి చరిత్రను వక్రీకరించారని వారు ఆరోపించారు. మొబైల్ గేమింగ్ తరహాలో రామయనాన్ని అసహాస్యం చేశారని విమర్శించారు. మరో వైపు ఆదిపురుష్ విడుదల రోజు, తర్వాత రెండు రోజులు భారీ కలెక్షన్లు సాధించాయి. సోమవారం నుంచి ఈ సినిమా కలెక్షన్లు భారీగా తగ్గాయి.
ఆదిపురుష్ కు సోమవారం ప్రపంచ వ్యాప్తంగా కేవలం రూ 24.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. శుక్రవారం రూ.137 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించి రికార్డులు కొల్లగొట్టిన ఈ చిత్రం తర్వాత..చతికిలపడింది. ఆదిపురుష్ సినిమాకు ఇప్పటికి వరకు రూ.340 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.500 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు సమాచారం. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.












Click it and Unblock the Notifications