బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం: కోస్తా జిల్లాలకు ఊరట
Karnataka rains: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం రెండు రాష్ట్రాలపై పడింది. కర్ణాటక, తమిళనాడుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఎండ తీవ్రత చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గింది. ఇదే పరిస్థితి మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అంచనావేసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో రెండు రోజులుగా కర్ణాటక, తమిళనాడులోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తోన్నాయి. బెంగళూరును సైతం వరుణుడు పలకరించాడు. నగరంలో పలు చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం పడింది.
కర్ణాటక కోస్తా తీర ప్రాంతాల్లో ఈ వర్షాల తీవ్రత అధికంగా కనిపించింది. మడికెరి, చామరాజనగర, దక్షిణ కన్నడ, ఉడుపి, హసన్ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. పశ్చిమ కనుమ మళ్లీ పచ్చదానాన్ని సొంతం చేసుకుంది. మంగళూరు, ముల్కి, మూడబిద్రి, పుత్తూరు, బంట్వాల, విట్లె, సుళ్య, సూరత్‌కల్.. వంటి పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

వేసవిలో ఈ స్థాయిలో వర్షపాతం నమోదు కావడానికి ప్రధాన కారణం- లా నినా బలహీనపడటమేనని భారత వాతావరణ కేంద్రం సీనియర్ సైంటిస్ట్ సీఎస్ పాటిల్ పేర్కొన్నారు. వర్షాల తీవ్రత మరో రెండు నుంచి మూడు రోజుల పాటు ఉండొచ్చని అంచనావేశారు. బెంగళూరులో నమోదవుతున్న ఉష్ణోగ్రత 2 నుంచి 4 డిగ్రీల మేర తగ్గుదల ఉంటుందని అన్నారు.
తమిళనాడులో భారీ వర్షాలు పడ్డాయి. దక్షిణ ప్రాంతంలోని పలు జిల్లాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. తిరునెల్వేలి, తెన్ కాశి, తూత్తుకూడి, విరుధునగర్, రామనాథపురం, పుదుక్కోట్టై, శివగంగ, తంజావూరు, మధురై జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. తిరుచ్చి, ఈరోడ్, సేలం, తిరువారూర్, నాగపట్నం, మైలాడుథురై, థేని, దిండిగల్, థేని, కోటగిరి, కోయంబత్తూరు.. వంటి ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.
@namma_vjy Mulki Dakshina Kannada pic.twitter.com/MVN6ygc21a
— B Ranjan Pai (@b_ranjan_pai) March 12, 2025
వర్షాల తీవ్రత కేరళలోనూ కనిపించింది. వాయనాడ్, కన్నూర్, కాసర్‌గాడ్ వంటి కేరళ ఉత్తరప్రాంత జిల్లాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు పడ్డాయి. వీటికి సంబంధించిన వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్ట్ అయ్యాయి. ఉత్తర కోస్తా జిల్లాలన్నింట్లోనూ చెప్పుకోదగ్గ వర్షపాతం నమోదైంది.
Pelting in Ambalawayal #Wayanad #Keralarains pic.twitter.com/oR1LthCKLQ
— MasRainman (@MasRainman) March 12, 2025












Click it and Unblock the Notifications