ఏప్రిల్ 1.. ఈ చెత్త పన్ను పెంచుడొకటి
Garbage Tax: బృహత్ బెంగళూరు మహానగర పాలికే అధికారులు షాకిచ్చారు. చెత్త పన్నును విధించారు. ఈ టారిఫ్ ఈ తెల్లవారుజాము నుంచి అమలులోకి వచ్చింది. ఉద్యాననగరిలో వ్యర్థపదార్థలు, ఇతర చెత్త సేకరణ, రవాణా, డంపింగ్ సహా.. ఇతర కార్యకలాపాలను మరింత మెరుగుపరిచడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రాపర్టీ ఓనర్లు ఇక తప్పనిసరిగా ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన యూజర్ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. బీబీఎంపీ వ్యర్థాల నిర్వహణ విషయంలో ఓనర్ల నుంచి ఈ యూజర్ ఛార్జీలను ఆస్తి పన్నుతో కలిపి వసూలు చేస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2025- 2026లో 685 కోట్ల రూపాయల మేర అదనపు ఆదాయాన్ని ఆర్జించాలని బీబీఎంపీ లక్ష్యంగా పెట్టుకుంది.

600 చదరపు అడుగుల వరకు- ప్రతి నెలా 10 రూపాయల మేర చెత్త పన్నును అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. 600 నుంచి 1,000 చదరపు అడుగులు- 50 రూపాయలు, 1,000 నుంచి 2,000 చదరపు అడుగులు- 100 రూపాయలు, 2,000 నుంచి 3,000 చదరపు అడుగులు- 150 రూపాయలను ప్రాపర్టీ ట్యాక్స్‌లో కలిపి కట్టాల్సి ఉంటుంది.
3,000 నుంచి 4,000 చదరపు అడుగులు- 200 రూపాయలు, 4,000 చదరపు అడుగులు, ఆపై నెలకు 400 రూపాయలను చెల్లించాల్సి ఉంటుందని బీబీఎంపీ తెలిపింది. పాయింట్ ఆఫ్ సేల్ మిషన్ల ద్వారా ఈ మొత్తాన్ని తమ సిబ్బంది వసూలు చేస్తారని తెలిపింది.
పెద్ద మొత్తంలో వ్యర్థాలను ఉత్పత్తి చేసేవారు, అక్కడికక్కడే వాటిని ప్రాసెస్ చేయాల్సి ఉంటుందని బీబీఎంపీ వివరించింది. అలా చేయకపోతే- అదనంగా కిలోకు 12 రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అక్కడికక్కడే కంపోస్టింగ్ చేసే వారికి కిలోకు మూడు రూపాయల చొప్పున రాయితీ లభిస్తుంది.
బెంగళూరు వ్యర్థాల నిర్వహణ, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, బెంగళూరు సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్‌కు ఈ బడ్జెట్‌లో 1,400 కోట్ల రూపాయలను కేటాయించింది సిద్ధరామయ్య సర్కార్. రోజూ 1,226 మెట్రిక్ టన్నుల ప్రాసెసింగ్ సామర్థ్యంతో కూడిన మెటీరియల్ రికవరీ ఫెసిలిటీని 104 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించాలని ప్రతిపాదించింది.












Click it and Unblock the Notifications