• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మోదీ కలిగించిన మోక్షం.!గడ్డం ఇంట్లో చేసుకోవాలి.. కటింగ్ మాత్రమే సెలూన్ లో..!లాక్‌డౌన్ 4.0

|

ఢిల్లీ/హైదరాబాద్ : కరోనా మహమ్మారి కట్టడిలో అనుసరిస్తున్న క్రియలు, ప్రక్రియల్లో వేగవంతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న లాక్‌డౌన్ ఆంక్షలు క్రమంగా స్వరూపాన్ని మార్చుకుంటున్నాయి. స్ధంభించిన జనజీవనానికి నెమ్మది నెమ్మదిగా వెసులుబాటులు కల్పిస్తూ లాక్‌డౌన్ 4 ఆంక్షలను అమలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఐతే ఈ నెల చివరివరకూ అమలులో ఉండే ఆంక్షల అంశంలో మాత్రం చాలా వరకు మినహాయింపులు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అందుకు సంబంధించి మోదీ ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.

కరోనా-5జీ వార్: రాయబారి డెత్ మిస్టరీ.. అమెరికాపైనే..ఇజ్రాయెల్‌కు చైనా టీమ్.. ట్రయాంగిల్ థ్రిల్లర్..

దేశంలో మొదలైన నాలుగోదశ లాక్‌డౌన్.. ఎన్నో సడలింపులిచ్చిన కేంద్రం..

దేశంలో మొదలైన నాలుగోదశ లాక్‌డౌన్.. ఎన్నో సడలింపులిచ్చిన కేంద్రం..

దేశంలో కేసుల సంఖ్య తగ్గకపోగా పెరుగుతూనే ఉన్నాయి. దాని కట్టడికోసం అందరూ ఊహించినట్టుగానే లాక్‌డౌన్ 4.0 అమలుచేసింది కేంద్రప్రభుత్వం. ఆంక్షలు యథాతధం చేస్తూనే కొన్ని సడలింపులు చేసింది. ఎందుకంటే ఆర్ధిక వ్యవస్థ చితికిపోతే దేశంలో భయంకరమైన పరిస్థితులు నెలకొంటాయి. కరోనా వైరస్ బలహీనులను, వృద్ధులను చంపేస్తుంది. కానీ ఆర్ధిక వ్యవస్థకు దారులు మూసేస్తే వయసు, ఆరోగ్యంతో సంబంధం లేకుండా అందరూ దెబ్బతింటారు. వ్యవస్థలు కూడా కుప్పకూలే ప్రమాదం ఉంది. అప్పుడు కరోనా వైరస్ మరణాలకంటే ఆకలి, ఆర్ధిక మరణాలే ఎక్కువగా సంభవిస్తుంటాయి. అందుకే కేంద్రం సడలింపులకే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.

తెరుచుకున్న సెలూన్లు.. జాగ్రత్తలు పాటించాలంటున్న కేంద్ర సర్కార్..

తెరుచుకున్న సెలూన్లు.. జాగ్రత్తలు పాటించాలంటున్న కేంద్ర సర్కార్..

ఇదిలా ఉండగా నాలుగో లాక్‌డౌన్ లో ఇచ్చిన సడలింపుల్లో ఒక అంశంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ముఖ్యంగా యువతను ఆ నిర్ణయం విపరీతంగా ఆకట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. అదే స్పా, సెలూన్లు, బ్యూటీ పార్లర్లకు అనుమతి ఇవ్వడం. ఇది ప్రతి ఒక్కరికీ ఇపుడు నిత్యావసరం అయిపోయింది. దీనిపై సిఫారసులు కూడా బాగా పెరుగుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో అందరూ వీటిని ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం వీటికి అనుమతి ఇచ్చింది. అటు క్షురకుల ఆర్థిక పరిస్థితులు, ఇటు ప్రజల అవసరం రెండూ గుర్తుంచుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

గడ్డం ఇంట్లోనే.. కేవలం కటింగ్ మాత్రమే సెలూన్ లో..

గడ్డం ఇంట్లోనే.. కేవలం కటింగ్ మాత్రమే సెలూన్ లో..

కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతులు వచ్చాయి కాబట్టి సెలూన్లను తెరుస్తున్నారు. ఐతే వీరికోసం కొన్ని ప్రత్యేక మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. సెలూన్లలో ప్రతి ఒక్కరూ చాలా అప్రమత్తంగా ఉండాలని, బౌతిక దూరం పాటిస్తూనే సెలూన్లలో సేవలు పొందాలని తెలుపుతోంది కేంద్రం. అందుకే సెలూన్లు బ్యూటీ పార్లర్ల విషయంలో కొన్ని సలహాలు ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. శానిటైజేషన్ చేసుకున్న చేతులతోనే కాకుండా ఖచ్చితంగా చేతికి గ్లౌజులు, మొఖానికి మాస్క్ ధరంచాలని పూచిస్తోంది. కిటింగ్ కు ఉపయోగించే పరికరాలను కూడా మనిషికి, మనిషికి శుభ్రం చేసిన తర్వాతే వాడాలని ఆదేశిస్తోంది.

ఫేషియల్, మస్సాజ్ లకు దూరంగా ఉండాలి.. అందం కన్నా ప్రాణం ముఖ్యమంటున్న కేంద్రం..

ఫేషియల్, మస్సాజ్ లకు దూరంగా ఉండాలి.. అందం కన్నా ప్రాణం ముఖ్యమంటున్న కేంద్రం..

షేవింగ్ ఇంట్లోనే చేసుకోవాలని, కేవలం కటింగ్ కు మాత్రమే సెలూన్ కి వెళ్తే కాస్త శ్రేయస్కరమని తెలుస్తోంది. కటింగ్ సమయంలో కప్పుకునేందుకు టవల్ లేదా లుంగీ లాంటి వస్త్రం సెలూన్ కి తీసుకెళ్లడం ఉత్తమమని తెలుస్తోంది. అంతే కాకుండా సెలూన్ లో ఉండే శానిటైజర్ కాకుండా సొంతంగా ఇంట్లోనుండి తీసుకెళ్తే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మహిళల విషయానికి వస్తే మరీ పెళ్లి, ఫంక్షను ఉంటే తప్ప మహిళలు సెలూన్లు, స్పాలకు వెళ్లకపోవడం మంచిదనే వాదన వినిపిస్తోంది. హోం సర్వీసును వాడుకుంటే చాలా వరకు బెటరంటున్నారు వైద్య నిపుణులు. స్పాలకు వెళ్లే సమయంలో టవల్స్, శానిటైజర్ కచ్చితంగా వెంట తీసుకెళ్లడంతో పాటు, ఫేషియల్స్, మస్సాజ్ లు ఎట్టి పరిస్థితుల్లో బయట చేయించుకోవద్దనే నిబంధనలు అమలులో ఉన్నాయి.

English summary
Salons are being opened as permits have come from the central government. So the Center has released some specific guidelines for them. The Center states that everyone in the salons should be very vigilant and serve in the salons while maintaining the physical distance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X