వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హని ట్రాప్, బ్లాక్ మెయిల్: మోడల్, నటి అరెస్టు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: అశ్లీల దృశ్యాలు చిత్రీకరించి తరువాత సీడీలు తయారు చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్న గ్యాంగ్ ను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్ కింగ్ పిన్ ప్రముఖ మోడల్, కన్నడ టీవీ సీరియల్ నటితో సహ నలుగురిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

కన్నడ టీవీ సీరియల్ నటి, మోడల్ హర్షిణి, లోకేష్, బిజ్రేష్, సునీల్ అనే నిందితులను అరెస్టు చేశారు. వీరి నుండి ఒక లక్ష రూపాయల నగదు, కారు, నాలుగు లక్షల ఖాళీ చెక్ లు స్వాదీనం చేసుకున్నామని బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు.

Bengalore City Police arrest Model, Kannada small screen actress Harshini

నటి హర్షిణిని అడ్డం పెట్టుకుని శ్రీమంతులకు వీరు గాలం వేస్తున్నారు. తరువాత వారిని హని ట్రాప్ లోకి దింపుతున్నారు. అనంతరం ఆ వ్యక్తితో బెడ్ రూంలో రహస్యంగా అశ్లీలంగా ఉన్న సమయంలో ముందుగా సీలింగ్ ఫ్యాన్ కు Sర్పాటు చేసి హెడెన్ కెమెరాలతో రికార్డు చేస్తున్నారు.

తరువాత ఆ దృశ్యాలతో సీడీలు తయారు చేసి వారిని బ్లాక్ మెయిల్ చేసి పరువు తీస్తామని బెదిరించి రూ. లక్షలు వసూలు చేస్తున్నారు. హని ట్రాప్ బాధితుడు ఇంజనీరు వినోద్ కుమార్ ఇక్కడి జ్ఞానభారతీ పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో హని ట్రాప్ ర్యాకెట్ గుట్టురట్టు అయ్యింది. వీరెంత మందిని ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేశారు అని పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.

English summary
Bengalore Police arrest Model, Kannada small screen actress Harshini allegedly doing honeytrap. Jnanabharati police arrested Harshini, Suneel, Brijesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X