వైరల్ వీడియో: ఏం ఫీల్ ఉంది మామ..! బస్సులో ఫైటింగ్..!
బస్సుల్లో, ట్రైన్స్ లో వాగ్వాదాలు, ఘర్షణలు సర్వ సాధారణం అయిపోయాయి. తాజాగా బెంగళూరులోని ఓ బస్సులో డ్రైవర్- మహిళా ప్రయాణికురాలు మధ్య ఘర్షణ చెలరేగింది. అది కొట్టుకునే స్థాయి వరకూ వెళ్లింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఈ వివాదంలో డ్రైవర్ కొందరు సమర్థిస్తుండగా.. మరికొందరు మహిళా ప్రయాణికురాలిని సమర్థిస్తున్నారు. మరి వీరిద్దరి మధ్య గొడవకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Caught on Camera: BMTC Bus Driver and Woman Passenger in Slap Spat on Tumakuru Road
— Karnataka Portfolio (@karnatakaportf) September 10, 2025
A seemingly routine BMTC bus ride on Tumakuru Road near Peenya turned dramatic when a verbal disagreement between a woman passenger and the driver escalated into a physical confrontation, with… pic.twitter.com/pGkqZNB1y5
కర్ణాటక బెంగళూరులోని పీన్యా లో ఆర్టీసీ బస్సు డ్రైవర్- ఓ మహిళా ప్రయాణికురాలి మధ్య వివాదం చెలరేగింది. ఇద్దరి మధ్య మాటలు ముదిరాయి. దీంతో మహిళా ప్రయాణికురాలు డ్రైవర్ పై చేయి చేసుకుంది. డ్రైవర్ కూడా మహిళపై చేయి చేసుకున్నాడు. దీంతో ఘర్షణ పెద్దదిగా మారింది. ఓవైపు వాళ్ళిద్దరినీ కండక్టర్ సముదాయిస్తున్నా ఇద్దరూ కొట్టుకునే స్థాయివరకూ వెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఈ వీడియోపై బెంగళూరు సిటీ పోలీస్ స్పందించింది. ఈ మేరకు ఘటన వివరాలను అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. ఈ ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అయితే ఈ ఘటనపై నెటిజెన్లు భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మహిళపై చర్యలు తీసుకోవాలని అంటుండగా.. మరికొందరు మాత్రం డ్రైవర్ ప్రవర్తనను తప్పుపడుతున్నారు. డ్రైవర్ పై అలా చేయిచేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్!












Click it and Unblock the Notifications