బెంగళూరు లేడీ డాక్టర్ హత్యకేసులో అడుగడుగునా ట్విస్టులే

బెంగళూరులో సంచలనం సృష్టించిన డాక్టర్ కృతికా రెడ్డి హత్య కేసు మిస్టరీ వీడింది. ఆమె భర్త, జనరల్ సర్జన్ డాక్టర్ మహేంద్ర రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆపరేషన్ థియేటర్లలో మాత్రమే ఉపయోగించే ప్రొపోఫోల్ అనే మత్తు మందును ఉపయోగించి ఈ హత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తర్వాత నిందితుడు తన మకాంను బెంగళూరు నుంచి ఉడుపి జిల్లా మణిపాల్ కు మార్చాడు. ఈ మధ్యాహ్నం పోలీసులు అతన్ని మణిపాల్ లో అరెస్ట్ చేశారు. బెంగళూరుకు తరలించారు.

మహేంద్ర రెడ్డి, కృతికా రెడ్డి ఇద్దరూ డాక్టర్లే. బెంగళూరు విక్టోరియా ఆసుపత్రిలో పని చేసేవాళ్లు. కృతికా రెడ్డి డెర్మటాలజిస్ట్. తల్లిదండ్రులు మారతహళ్లిలో నివసిస్తోన్నారు. ఒకే ఆసుపత్రిలో పని చేస్తోండటం, డాక్టర్లే కావడం వల్ల మహేంద్ర రెడ్డికి ఇచ్చి పెళ్లి చేశారు. 2024 మే 26వ తేదీన వారి పెళ్లి జరిగింది. ఏడాది కూడా తిరగక ముందే కృతికా రెడ్డి హత్యకు గురి కావడం సంచలనం రేపింది. ఆమె హత్యలో సినిమాటిక్ కోణాలు వెలుగులోకి వచ్చాయి.

Bengaluru Doctor Arrested Following Investigation

అనారోగ్య కారణాలతో కొంతకాలంగా మారతహళ్లిలోని తండ్రి ఇంట్లో ఉంటున్న కృతిక ఈ ఏడాది ఏప్రిల్ 23న అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. ఈ విషయం తెలుసుకుని మహేంద్ర రెడ్డి ఆమెను పరామర్శించడానికి మారతహళ్లికి వెళ్లాడు. అక్కడే ఉంటూ ట్రీట్మెంట్ ఇచ్చేవాడు. ఇందులో భాగంగా రెండు రోజుల పాటు ఇంట్రావీనస్ ఇంజెక్షన్లు ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో ఆమె అనారోగ్యం మరింత క్షీణించింది.

శ్వాస తీసుకోలేని స్థితికి చేరిన కృతికను 26వ తేదీన సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు. మొదట్లో ఇది సహజ మరణంగా భావించారు. అనారోగ్య కారణాల వల్లే మృతి చెంది ఉండొచ్చని పోలీసులు కూడా విశ్వసించారు. అన్​నేచురల్ డెత్ రిపోర్ట్ (UDR)గా కేసు నమోదు చేశారు. దీని తర్వాత మహేంద్ర రెడ్డి మణిపాల్ కు షిఫ్ట్ అయ్యాడు. అక్కడే క్లినిక్ తెరిచాడు.

రేడియాలజిస్ట్ అయిన కృతిక అక్క డాక్టర్ నిఖితా రెడ్డికి అనుమానం వచ్చింది. సమగ్ర విచారణకు ఆమె పట్టుబట్టారు. ఆరు నెలల తర్వాత ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL) నివేదిక వెలుగులోకి వచ్చింది. కృతిక శరీరంలో అనేక అవయవాల్లో ప్రొపోఫోల్ ఆనవాళ్లు ఉన్నట్లు ఫోరెన్సిక్ రిపోర్ట్ లో తేలింది. మత్తు మందు కారణంగానే ఆమె మరణించిందని స్పష్టంగా తేలింది. దీంతో మారతహళ్లి పోలీసులు రంగ ప్రవేశం చేశారు.

యూడీఆర్ గా నమోదు చేసిన ఈ కేసును తిరగరాశారు. సెక్షన్ 103 ప్రకారం హత్య కేసుగా బదలాయించారు. మహేంద్ర రెడ్డిపై లుక్ అవుట్ సర్క్యులర్ ఇచ్చారు. ఈ మధ్యాహ్నం అతన్ని అరెస్ట్ చేశారు. డాక్టర్ కావడం, తనకు ఉన్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆపరేషన్ థియేటర్, ఐసీయులో మాత్రమే అందుబాటులో ఉండే మందులను హత్యకు ఉపయోగించాడని, సహజ మరణంగా చిత్రీకరించడానికి ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు.

కాగా- మహేంద్ర కుటుంబానికి నేర చరిత్ర ఉందని పోలీసులు విచారణలో వెల్లడైంది. అతని కవల సోదరుడు డాక్టర్ నాగేంద్ర రెడ్డిపై 2018లో హెచ్‌ఏఎల్ పోలీస్ స్టేషన్‌లో ఛీటింగ్ కేసు నమోదైంది. మరొక సోదరుడు రాఘవ రెడ్డిపైనా 2023లో బెదిరింపుల కేసు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. పెళ్లి సమయంలో వీటన్నింటినీ దాచిపెట్టారని కృతిక కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. కృతిక తండ్రి ముని రెడ్డి ఫిర్యాదు మేరకు మహేంద్రను అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+