ఫేస్ బుక్ నకిలీ అకౌంట్ లో మహిళ ఫోటోలు, వేశ్య అంటూ కామెంట్, టార్చర్, చివరికి!

బెంగళూరు: యువతులు, మహిళలు ఫేస్ బుక్ లో పోస్టు చేస్తున్న ఫోటోలు దుర్వినియోగం అవుతున్నాయని బెంగళూరు నగరంలో మరోసారి వెలుగు చూసింది ఫేస్ బుక్ నకిలీ అకౌంట్ లో వేరే మహిళ ఫోటో పోస్టు చేసి ఆమె వేశ్యవాటిక కేంద్రం నిర్వహిస్తుందని, ఆసక్తి ఉన్న వారు ఆమెను సంప్రధించాలని పోస్టు చేసి టార్చర్ పెట్టాడు. బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో చివరికి నిందితుడు జైలుకు వెళ్లాడు.

బెంగళూరు నగరంలోని హెస్ఎస్ఆర్ లేఔట్ లో ఓ మహిళ (36) నివాసం ఉంటున్నది. చందన్ అనే వ్యక్తి ఆ మహిళ పేరు, ఫోటోతో ఫేస్ బుక్ లో నకిలీ అకౌంట్ ను ప్రారంభించాడు. ఫేస్ బుక్ నకిలీ అకౌంట్ లో ఆమె వేశ్యవాటిక కేంద్రం నిర్వహిస్తుందని, ఆసక్తి ఉన్నవారు సంప్రధించాలని ఆమె ఆహ్వానిస్తున్నట్లు పోస్టు చేశాడు.

మూడు రోజుల క్రితం మహిళ బంధువు ఫేస్ బుక్ లో ఈ విషయం గుర్తించాడు. వెంటనే అతను ఆమెకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. ఫేస్ బుక్ లో తన ఫోటోలు, పేరుతో ఉన్న అసభ్య కామెంట్స్ చూసి తాను షాక్ అయ్యానని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

 Bengaluru lady Profile picture of facebook misused police investigation

నాపేరు, ఫోటోలతో ఎవరో నకిలీ అకౌంట్ క్రియేట్ చేసి అసభ్యంగా కామెంట్స్ పోస్టు చేశారని బాధితురాలు హెచ్ఎస్ఆర్ లేఔట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మహిళ పేరుతో నకిలి అకౌంట్ ప్రారంభించిన చందన్ ను అరెస్టు చేశారు.

చందన్ మహిళల ఫోటోలతో నకిలి అకౌంట్లు ప్రారంభించి వేరే మహిళలకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి వారిని అసభ్యంగా టార్చర్ పెడుతున్నాడని హెచ్ఎస్ఆర్ లేఔట్ పోలీసులు అంటున్నారు. మహిళ పేరుతో ప్రారంభించిన ఫేస్ బుక్ నకిలీ అకౌంట్ బ్లాక్ చేశామని, ఇతను ఇంకా ఎంత మంది మహిళల జీవితాలతో ఇలా చెలగాటం ఆడుకున్నాడు అని ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+