వైరల్ వీడియో: ర్యాపిడో ఎక్కిన యువతి.. బండిపైనే రైడర్ ఏకంగా..

ఇటీవలి కాలంలో ప్రైవేట్ ట్రావెల్ సర్వీసులు విపరీతంగా పెరిగిపోయాయి. త్వరగా వెళ్లాలన్న కారణంతో చాలా మంది విద్యార్థులు, ఉద్యోగులు.. ర్యాపిడో, ఓలా, ఉబర్ లాంటి బైక్ సర్వీసులను ఎంచుకుంటున్నారు. అయితే ఈ మధ్య రైడర్ల ప్రవర్తనపై సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే బెంగళూరులో జరిగింది. ర్యాపిడోలో జర్నీ చేసిన ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని తన ఇన్ స్టా ఖాతాలో పోస్టు చేసింది ఆ యువతి. అది కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

బెంగళూరులో ఓ ర్యాపిడో రైడర్ తన వెనకాల కూర్చొన్న యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె కాళ్లను తనపై లాగుతూ ఆమెను ఇబ్బంది పెట్టాడు. ఈ దృశ్యాలను ఆ యువతి తన ఫోన్లో రికార్డు చేసింది. ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించింది. యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఈ ఘటన నవంబర్ 6 గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో జరిగింది. ఈ ఘటనపై విల్సన్ గార్డెన్ పోలీసులు.. ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

ఇన్ స్టా పోస్టులో యువతి తెలిపిన వివరాల ప్రకారం.. "చర్చి స్ట్రీట్ నుంచి పీజీ(పేయింగ్ గెస్ట్) కు వెళ్లేందుకు ర్యాపిడో బుక్ చేసుకున్నాను. ర్యాపిడో ఎక్కాక.. మార్గమధ్యలో అతడు నా కాళ్లపై రుద్దడం గమనించాను. అతడు అలాగే చేయడం ప్రారంభించాడు. నేను 'భయ్యా ఏం చేస్తున్నావ్..? అలా చేయకు' అని చెప్పాను అతడు మాత్రం అలాగే చేస్తున్నాడు. ఆ ప్లేస్ కు కొత్త కావడం వల్ల నేను బండి ఆపమని చెప్పలేదు. అతడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలియలేదు. కొద్దిసేపటికి గమ్య స్థానానికి రీచ్ అయ్యాను" అని తెలిపింది.

Bengaluru Nightmare Rapido Driver s Chilling Harassment of Young Woman Goes Viral on Insta

అదే సమయంలో అక్కడున్న వ్యక్తి ఏమైందని అడిగాడు. జరిగింది చెప్పాక .. అతడి ముందే ర్యాపిడో రైడర్ క్షమాపణ చెప్పాడు. ఇంకెప్పుడు అలా చేయనని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత రైడర్.. తన వైపు వేలు చూపించుకుంటూ వెళ్తున్నట్లు యువతి పేర్కొంది. ఈ మేరకు ఘటనను తన ఇన్ స్టాలో పోస్టు చేసింది. ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+