కిలోమీటర్ కు రూ.425 ఆటో ఛార్జీ.! బెంగళూరు షాక్..!
దేశంలో ఇప్పుడు ఎక్కడ లేని వింతలు, విచిత్రాలన్నీ బెంగళూరు నగరంలోనే చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే నగరంలో పెరిగిపోయిన ధరలతో సామాన్యులు ఉక్కిరిబిక్కిరవుతుంటే.. తాజాగా చోటు చేసుకుంటున్న ఘటనలు వారిలో ఆగ్రహాన్ని మరింత పెంచేస్తున్నాయి. ముఖ్యంగా నగరంలో ఆటో వాలాలు, యాప్ ల దోపిడీ అంతకంతకూ పెరిగిపోతుండటంపై జనం మండిపడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.
తాజాగా నిన్న రాత్రి బెంగళూరులో వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో ఓ ఉద్యోగి నగరంలో ఓ కిలోమీటర్ దూరంలో ఉన్న ఇంటికి వెళ్లేందుకు ఉబెర్ యాప్ లో ఆటో బుక్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. కానీ ఈ కిలోమీటర్ దూరానికి ఉబెర్ యాప్ లో చూపించిన ఛార్జీ చూసి షాకయ్యాడు. ఎంతలా అంటే అదేదో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో చెప్పినట్లు సింపుల్ గా జేబులో చేతులుపెట్టుకుని అలా నడిచి వెళ్లిపోయాడు. దీంతో అతని స్నేహితుడు సదరు రూ.425 ఆటో ఛార్జీ స్క్రీన్ షాట్ ను తీసి రెడ్డిట్ లో పెట్టడంతో వైరల్ అవుతోంది.

బెంగళూరులో ఆటో యాప్స్ దోపిడీ ఎలా ఉందో తెలియజేసేలా ఉన్న ఈ ఘటనపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. బెంగళూరులో ఆటో ఛార్జీలు ఫస్ట్ వరల్డ్ దేశాలతో సమానంగా ఉన్నాయని ఒకరు కామెంట్ చేస్తే, జర్మనీలో బెంజ్ కారులో ట్యాక్సీ బుక్ చేసుకుంటే ఇంతే అవుతుందని సెటైర్ వేశారు. కాబట్టి ఆటో కొనుక్కుంటే మంచిందని తోటి నెటిజన్లకు సూచించాడు. కోటీ 30 లక్షల జనాభా ఉన్న బెంగళూరులో అంతకు మించి వాహనాలు రోడ్లను కమ్మేస్తున్నాయి.

దీంతో పీక్ వేళల్లో నగర వాసులు, ఉద్యోగులు ప్రయాణాలు చేయాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అదే సమయంలో వర్షం పడిందంటే చాలు వారి కష్టాలు రెట్టింపు అయిపోతున్నాయి. ఇందులో భాగమే ఈ కిలోమీటర్ కు రూ.425 ఆటో ఛార్జీ ఘటన. మామూలుగానే పీక్ వేళల్లో ఆటో యాప్స్ లో ఛార్జీలు ఎక్కువగా ఉంటున్నాయని, అదే భారీ వర్షం కురిసిందంటే ఇక వారి దోపిడీకి హద్దు లేకుండా పోతోందని నగర వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న చమురు ధరలు కూడా ఇందుకు మరో కారణంగా తెలుస్తోంది.
-
Viral Video: అందరిముందు I LOVE U చెప్పిన ప్రొఫెసర్.. చెప్పుతో కొట్టిన విద్యార్థిని -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications