ఐటీ హబ్ లో గోల్ మాల్ గ్యాంగ్, నకిలి ఆధార్ కార్డు, పాస్ పోర్టు, ఓటర్ ఐడీ ఎలా చేస్తారంటే ?
ఐటీ హబ్ బెంగళూరు నగరానికి ప్రతిరోజు కొన్ని లక్షల మంది ప్రజలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వెలుతున్నారు. బెంగళూరులో ఇతర రాష్ట్రాలు, విదేశాలకు చెందిన ప్రజలు నివాసం ఉంటున్నారు. బెంగళూరులో నివాసం ఉండే ప్రజలు ఐటీహబ్ లో గుర్తింపు కార్డులు సంపాధించుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
కర్ణాటకలో ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఉంటే అనేక లాభాలు ఉన్నాయి. ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, పాన్ కార్డు తదితర భారత ప్రభుత్వం జారీ చేసే గుర్తింపు కార్డులు సంపాధించడానికి కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. ఇలాంటి వారిని టార్గెట్ చేసుకున్న కొందరు బ్రోకర్లు వారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు సంపాధించడానికి నకిలి ప్రభుత్వ గుర్తింపు కార్డులు తయారు చేస్తున్నారు.

బెంగళూరు నగరంలోని గంగమ్మనగుడి పోలీస్ స్టేషన్ పరిధిలోని కమ్మగొండనహళ్ళి ప్రాంతంలో క్రిష్ణమూర్తి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. శ్రీక్రిష్ణ కంప్యూటర్స్ అనే పేరుతో క్రిష్ణమూర్తి ఓ ఆఫీసు నడుపుతున్నాడు. స్థానికంగా నివాసం ఉంటున్నట్లు ఆధార్ కార్డు, ఓటర్ ఐడీలను తయారు చేసి ఇస్తామని ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కొందరిని రహీమ్, ఖయూమ్ అనే వ్యక్తులు సంప్రధించారు.
బాంగ్లాదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన కొందరికి నకిలి ఓటర్ ఐడీలు, ఆధార్ కార్డులు, పాస్ పోర్టులు ఇప్పిస్తామని నమ్మించారు. ఇలా నకిలి ఓటర్ ఐడీలు, ఆధార్ కార్డులు తయారు చేసి ఇస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు క్రిష్ణమూర్తికి చెందిన కంప్యూటర్ సెంటర్ మీద దాడి చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

క్రిష్ణమూర్తి ఇచ్చిన సమాచారంతో బ్రోకర్లు కేవల్. ఖయూమ్, రహీమ్ అనే నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. నిందితులు ఇతర రాష్ట్రాలు, పొరుగు దేశాలకు చెందిన వారికి బెంగళూరులో నివాసం ఉంటున్నట్లు నకిలి పత్రాలు తయారు చేసి వాటి ఆధారంగా నకిలి ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, పాస్ పోర్టులు తయారు చేసి ఇస్తున్నారని పోలీసులు అన్నారు.
ఇలా నకిలి గుర్తింపు కార్డులు తయారు చేసి ఇచ్చినందుకు ఒక్కొక్కరి నుంచి రూ. 500 నుంచి రూ. 5, 000కు పైగా వసూలు చేస్తున్నారని విచారణలో నిందితులు అంగీకరించారని, వీరు ఇంకా ఎంత మందికి ఇలా నకిలి గుర్తింపు కార్డులు తయారు చేసి ఇచ్చారు అని ఆరా తీస్తున్నామని బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు. బెంగళూరులో నకిలి ఆధార్ కార్డుల దందా వెలుగు చూడటంతో స్థానిక ప్రజలు ఉలిక్కిపడ్డారు.












Click it and Unblock the Notifications