అర్దరాత్రి భర్త ఎంట్రీ, ఆ టైమ్ లో బెడ్ రూమ్ లో ఏం చేస్తుందంటే ?, భార్యకు తిక్తరేగితే మొగుడి ప్రాణం !
వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. ఉద్యోగం చెయ్యడానికి దంపతులు సిటీకి వెళ్లారు. దంపతులు ఇద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అర్దరాత్రి మద్యం సేవించి ఇంటికి వెళ్లిన భర్త అతని భార్యను చూసి షాక్ అయ్యాడు. ఆ సమయంలో ఇద్దరి మద్య పెద్ద గొడవ జరిగింది. ఆ సందర్బంలో సహనం భార్యకు తిక్తరేగి కత్తి తీసుకుని ఆమె భర్తను దారుణంగా పొడిచి చంపేసింది.
ఒడిశాకు చెందిన ఉమేష్ దామి (27) అనే వ్యక్తి ఐదు సంవత్సరాల క్రితం మనీషా అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తరువాత ఉమేష్, మనీషా దంపతులు సంతోషంగా జీవించారు. అయితే సంసారం సాగించడంలో కష్టాలు ఎదరురు కావడంతో గత సంవత్సరం ఉమేష్, మనీషా దంపతులు బెంగళూరు చేరుకుని అద్దె ఇల్లు తీసుకుని నివాసం ఉంటున్నారు.

హుళిమావు సమీపంలో నివాసం ఉంటున్న ఉమేష్ ఓ కాలేజ్ లో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తున్నాడు. ఉమేష్ భార్య మనీషా కాలేజ్ సమీపంలోని అపార్ట్ మెంట్ లో పని చేస్తోంది. ప్రతిరోజు ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తున్న దంపతులు హ్యాపీగానే ఉన్నారు. ఇదే సందర్బంలో మనీషా ఓ యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో ఎంజాయ్ చేస్తోంది.
రాత్రి డ్యూటీ పూర్తి అయిన తరువాత ఉమేష్ పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెలుతున్నాడు. ఎప్పటిలాగే గురువారం రాత్రి మద్యం సేవించిన ఉమేష్ అర్దరాత్రి 12 గంటల సమయంలో ఇంటికి వెళ్లాడు. ఆ సందర్బంలో మనీషా ఆమె ప్రియుడితో వీడియో కాల్ లో మాట్లాడుతోంది. ఉమేష్ ఇంటిలోకి వెళ్లిన తరువాత అతని భార్య మనీషా భయపడిపోయి ఫోన్ కాల్ కట్ చేసింది.

అప్పటికే భార్య మనీషా అక్రమ సంబంధం గురించి చిన్న సమాచారం ఉండటంతో ఉమేష్ అతని భార్యతో పెద్ద గొడవ పెట్టుకున్నాడు. తరువాత మనీషా, ఉమేష్ ల మద్య పెద్ద గొడవ జరిగింది ఆ సందర్బంలో మాటామాటా పెరిగిపోవడంతో సహనం కోల్పోయిన ఉమేష్ కత్తి తీసుకుని అతని భార్య మనీషాను పొడవడానికి ప్రయత్నించాడు. ఆ సందర్బంలో కత్తి లాక్కొన్న మనీషా ఆమె భర్త ఉమేష్ చాతిలో పొడిచేసింది.
తీవ్రగాయాలైన ఉమేష్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. విషయం తెలుసుకున్న హుళిమావు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మనీషాను అరెస్టు చేశారు. అక్రమ సంబంధం విషయంలో భార్యను నిలదీసిన ఉమేష్ ను అతని భార్య మనీషా హత్య చేసిందని, కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు. బతకడానికి బెంగళూరుకు వచ్చిన ఉమేష్ అతని భార్య చేతిలో హత్యకు గురికావడం కలకలం రేపింది.












Click it and Unblock the Notifications