ఆ మత్తులో, సాఫ్టువేర్ ఇంజనీర్ నన్ను రేప్ చేశాడు: మహిళా టెక్కీ ఫిర్యాదు, ట్విస్ట్

బెంగళూరు: విహారయాత్రకు అని తీసుకు వెళ్లి తనపై తన బాయ్ ఫ్రెండ్ అత్యాచారం చేశాడని ఓ మహిళా సాఫ్టువేర్ ఇంజనీర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. ఈ సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి మోసం చేశాడని చెప్పింది.

ఆ యువతి హెచ్‌ఎఎల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పరారీలో ఉన్న నిందితుడు దినేష్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు నిందితుడు బెంగళూరులోని బహుళ జాతి కంపెనీలో పని చేసేవాడు. అదే కంపెనీలో పని చేస్తున్న యువతితో పరిచయమైంది.

ప్రేమగా మారిన పరిచయం

ప్రేమగా మారిన పరిచయం

వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇటీవల ఇద్దరూ విహారయాత్రలకు వెళ్లారు. అక్కడ అద్దెకు గది తీసుకున్నారు. ఇద్దరం ప్రేమించుకున్నామని, పెళ్లి కూడా చేసుకుందామంటూ మాయమాటలు చెప్పాడని, ఓ రాత్రి పానీయంలో మత్తుమందు కలిపి తాగించి బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.

సెల్‌ఫోన్‌లో అత్యాచార దృశ్యాలు

సెల్‌ఫోన్‌లో అత్యాచార దృశ్యాలు

అత్యాచార దృశ్యాల్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియోను ఇంటర్నెట్లో పెడతానని బెదిరించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దుండగుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. నిందితుడు శివమొగ్గకు చెందినవాడు.

 మరో ట్విస్ట్

మరో ట్విస్ట్

మరో ట్విస్ట్ ఏమంటే.. నిందితుడికి ఇప్పటికే మరో యువతితో పెళ్లి నిశ్చయం అయింది. అయినప్పటికీ ఈ యువతితో చెట్టాపట్టాల్ వేసుకొని తిరిగాడు. అతని పైన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గత ఏడాది డిసెంబర్ 23వ తేదీన అతను రెండు రోజుల పాటు ఇద్దరికీ విహారయాత్ర కోసం బుక్ చేసి, ఆమెను మోసం చేశాడు.

 చివరి బస్ మిస్ కావడంతో

చివరి బస్ మిస్ కావడంతో

మురుడేశ్వర్, గోకర్ణ, మడికేరిలకు బుక్ చేశాడు. మడికేరిలో ఉండగా వారికి చివరి బస్సు మిస్ అయింది. బస్సు మిస్ అయిందని, ఈ రాత్రికి ఇక్కడే ఉండి తర్వాత బెంగళూరుకు వెళ్తామని ఆమెకు నమ్మబలికాడు. బస్సు మిస్ కావడంతో ఆమె కూడా అంగీకరించింది.

మత్తుమందు ఇచ్చి, శృంగారం

మత్తుమందు ఇచ్చి, శృంగారం

ఆ సమయంలో దినేష్ తనకు కొబ్బరి నీళ్లు తెచ్చి ఇచ్చాడని, అవి తాగిన తర్వాత తాను మత్తులోకి వెళ్లిపోయానని చెప్పింది. ఆ సమయంలో అతను తనతో శృంగారంలో పాల్గొన్నాడని చెప్పింది. ఆ తర్వాత రోజు జరిగిన ఘటనకు అతను తనకు క్షమాపణ చెప్పాడని, పెళ్లి విషయమై పేరెంట్స్‌తో మాట్లాడుదామని చెప్పాడని తెలిపింది.

ఆ విషయం తెలిసి ఫిర్యాదు

ఆ విషయం తెలిసి ఫిర్యాదు

కానీ ఆ తర్వాత నుంచి దినేష్ తనకు దూరంగా ఉంటున్నాడని చెప్పింది. మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడని చెప్పింది. అతను మరో యువతిని పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి తాను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని చెప్పింది. ఆమె డిసెంబర్ 28న ఫిర్యాదు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+