సెక్స్ స్కాండల్ కేసు, హైకోర్టుకు భవానీ రేవణ్ణ, భర్త ఎమ్మెల్యే, కొడుకు ఎంపీ, ఏం కష్టం వచ్చింది ?

లైంగిక వేధింపులు, అత్యాచారం కేసులో నిందితురాలు, హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీ రేవణ్ణకు అరెస్టు అవుతాననే భయం పట్టుకుంది. కర్ణాటకలోని మైసూరు జిల్లా కే.ఆర్. నగర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోసం భవానీ రేవణ్ణ ఇప్పుడు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. కిందికోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో భవానీ రేవణ్ణ శనివారం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.

కేఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో మహిళ అపహరణ కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తును ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపులు, అత్యాచారం కేసును విచారిస్తున్న సిట్‌కు అప్పగించారు. ఈ కేసులో సిట్ భవానీ రేవణ్ణ దర్యాప్తు చేయాల్సి ఉంది. అరెస్టు భయంతో ఉన్న భవానీ రేవణ్ణ బెంగళూరులోని ప్రత్యేక కోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ మంజూరు చెయ్యాలని కోర్టుకు మనవి చేశారు.

Bhavani Revanna approached Karnataka High Court for anticipatory bail

శుక్రవారం కోర్టులో భవానీ రేవణ్ణ బెయిల్ పిటీషన్ విచారణ జరిగింది. కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ భార్య భవానీ రేవణ్ణ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సిట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజ్వల్ రేవణ్ణ, హెచ్‌డీ రేవణ్ణలపై అత్యాచారం, లైంగిక వేధింపులు, కిడ్నాప్ కేసులను విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) భవానీ రేవణ్ణ ముందస్తు బెయిల్‌ ఇవ్వడానికి కోర్టులో అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఇంటి పనిమనిషి అపహరణలో భవానీ రేవణ్ణ పాత్రపై విచారణ జరపాలని సిట్ కోర్టుకు చెప్పింది. భవానీ రేవణ్ణ, ఆమె కుటుంబ సభ్యులు చాలా ప్రభావవంతమైన నాయకులు అని, వాళ్లకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేసి బాధితులను, సాక్షులను ప్రభావితం చేయగలరని సిట్ కోర్టుకు తెలిపింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు భవానీ రేవణ్ణకు ముందస్తు బెయిల్‌ ఇవ్వడానికి తిరస్కరించింది.

Bhavani Revanna approached Karnataka High Court for anticipatory bail

ప్రత్యేక కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో భవానీ రేవణ్ణ శనివారం కర్ణాటక హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కర్ణాటక హైకోర్టు భవానీ రేవణ్ణ ముందస్తు బెయిల్ పిటీషన్ ను విచారణ చెయ్యడానికి స్వీకరించింది. భవానీ రేవణ్ణకు కర్ణాటక హైకోర్టు బెయిల్ ఇస్తుందా, లేదా ?, బెయిల్ ఇవ్వడానికి సిట్ అభ్యంతరం చెబుతుందా ? అనే విషయం సోమవారం తెలుస్తుందని న్యాయనిపుణులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+