పుట్టినరోజున బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కంటతడి.. ఈ రోజు కేబీసీ చాలా స్పెషల్!!

బాలీవుడ్ స్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు ఈరోజు. ఇప్పటికే ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువగా మారాయి. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ రోజు అమితాబ్ బచ్చన్ పుట్టినరోజున జరగనున్న కౌన్ బనేగా కరోడ్పతి స్పెషల్ ఎపిసోడ్లో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.

ఇప్పటికే అమితాబచ్చన్ పుట్టినరోజును పురస్కరించుకుని పెద్ద ఎత్తున ఫ్యాన్స్ వేడుకలు జరుపుతున్నారు. కౌన్ బనేగా కరోడ్పతి షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బి అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు వేడుకలను షో నిర్వాహకులు కూడా చాలా బాగా నిర్వహించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా అనేక సర్ప్రైజ్ లను ప్లాన్ చేసి ఆయనను భావోద్వేగానికి గురి చేశారు.

Big B Amitabh Bachchan tears up on his birthday.. KBC is very special today!!

కౌన్ బనేగా కరోడ్పతి హాట్ సీట్లో కూర్చున్న అమితాబచ్చన్ నిర్వాహకులు చేసిన సర్ప్రైజ్ లతో భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. ఇక ఆపండి.. ఇంకెంత ఏడిపిస్తారు అంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు. తాను షోలో ఎమోషనల్ అయ్యే వారి కళ్ళు తుడుచుకోవడానికి టిష్యూలు ఇస్తుంటాను అని, కానీ ఈసారి నాకు వాటి అవసరం పడిందని బిగ్ బి అమితాబ్ బచ్చన్ పేర్కొన్నారు.

కౌన్ బనేగా కరోడ్పతి వేదికగా జరిగే పుట్టినరోజు వేడుకలు అత్యుత్తమమైనవని, అవి చాలా స్పెషల్ అని అమితాబచ్చన్ ఎమోషనల్ గా చెప్పారు. నేడు ప్రసారం కాబోయే కౌన్ బనేగా కరోడ్పతి ఎపిసోడ్లో ఈ దృశ్యం ఆవిష్కృతం కానుందని సమాచారం. ఈ స్పెషల్ ఎపిసోడ్లో చిరంజీవి, విద్యాబాలన్, విక్కీ కౌశల్ తదితర సెలబ్రిటీలు పాల్గొననున్నారు.

ఇప్పటికే చిరంజీవి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పి ఈ రోజు రాత్రి కౌన్ బనేగా కరోడ్పతిలో కలిసేందుకు ఉత్సాహంగా ఉన్నానని అన్నారు. ఇక షో లో ఎమోషనల్ అయిన బిగ్ బి అమితాబ్ బచ్చన్ ను చూసిన ఫ్యాన్స్ కూడా కంటతడి పెట్టారు. 81వ పుట్టినరోజు జరుపుకుంటున్న అమితాబ్ బచ్చన్ ఈసారి తన పుట్టినరోజును చాలా స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+