Wakf Act: వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు-కేంద్రానికి బిగ్ షాక్..!

కేంద్రం పార్లమెంట్ లో ఆమోదించిన, రాష్ట్రపతి ఆమోదం తెలిపిన వక్ఫ్ సవరణ చట్టం విషయంలో సుప్రీంకోర్టు ఇవాళ సంచలన తీర్పు ఇచ్చింది. ఈ చట్టం విషయంలో తలెత్తిన అభ్యంతరాల నేపథ్యంలో దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు వాటిపై స్టే ఇచ్చింది. దీంతో ఈ చట్టం విషయంలో అభ్యంతరాల్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిన కేంద్రానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

కేంద్రం వక్ఫ్ చట్టానికి చేసిన సవరణలలో కొన్నింటిపై ముస్లిం వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ఆ ఆస్తిని వక్ఫ్ కు సంబంధించిదా కాదా అనేది తేల్చే అధికారం కలెక్టర్లకు ఇవ్వడం, కేంద్ర, రాష్ట్రాల వక్ఫ్ బోర్డుల్లో ఇతర మతాలకు చెందిన అధికారుల నియామకం, కనీసం ఐదు సంవత్సరాలు ఇస్లాంను ఆచరించిన వారు మాత్రమే తమ ఆస్తుల్ని వక్ఫ్ కు దానం ఇచ్చే నిబంధన పెట్టడం తీవ్ర వివాదాస్పదమయ్యాయి. వీటిపైనే అత్యధిక శాతం పిటిషన్లు దాఖలయ్యాయి.

Big SC Order Key Sections of Waqf Amendment Act Stayed

వీటిపై ఇప్పటికే సుప్రీంకోర్టు పలుమార్లు విచారణ జరిపింది. చివరికి ఇవాళ ఛీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మాసిహ్ తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఇవాళ ఆయా సవరణల అమలును నిలిపేస్తూ కీలక తీర్పు ఇచ్చింది. కేంద్రం వక్ఫ్ చట్టంలో చేసిన సవరణలు ఏకపక్షంగా అధికారాన్ని వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే మొత్తం చట్టం అమలు చేయొద్దని ఎవరూ కోరలేదని, అందుకే ఈ సవరణల అమలును మాత్రమే నిలిపేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.

Big SC Order Key Sections of Waqf Amendment Act Stayed

వక్ఫ్ సవరణ చట్టంలో జిల్లా కలెక్టర్‌కు ఇచ్చిన విస్తృత అధికారాలపై సుప్రీంకోర్టు అభ్యంతరం తెలిపింది. కలెక్టర్ వ్యక్తిగత పౌరుల హక్కులను తీర్పు చెప్పడానికి అనుమతి లేదని తెలిపింది.. ఇది అధికారాల విభజనను ఉల్లంఘిస్తుందని పేర్కొంది. ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చే వరకూ ఏ పార్టీకి వ్యతిరేకంగా మూడవ పక్ష హక్కులను సృష్టించలేమని వెల్లడించింది. కలెక్టర్‌కు అలాంటి అధికారాలతో వ్యవహరించే నిబంధన నిలిపేస్తున్నట్లు తెలిపింది. అలాగే వక్ఫ్ బోర్డులో ముగ్గురు కంటే ఎక్కువ మంది ముస్లిం కాని సభ్యులను, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్‌లో నలుగురు కంటే ఎక్కువ మంది ముస్లిం కాని సభ్యులను చేర్చకూడదని పేర్కొంది. చివరిగా కనీసం ఐదు సంవత్సరాలు ఇస్లాంను ఆచరిస్తున్న వ్యక్తి మాత్రమే వక్ఫ్ ప్రకటించవచ్చని చట్టంలోని నిబంధనను కూడా నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+