Bigg Boss OTT 2: తేదీ వచ్చేసింది: స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్, కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే

ముంబై: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో.. బిగ్ బాస్. హిందీలో సక్సెస్ అయిన తరువాత పాన్ ఇండియా ఐడెంటిటీ లభించింది దీనికి. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో అదే రేంజ్‌లో హిట్ కొట్టింది. దక్షిణాది బిగ్ బాస్‌ షో- పరిచయం కావడంలో కీ రోల్ పోషించాడు సల్లూ భాయ్.

హిందీ బిగ్ బాస్‌ ఫార్మట్‌లోనే మిగిలిన లాంగ్వేజెస్‌లల్లో కూడా ఈ రియాలిటీ షో- వ్యూవర్స్‌ను ఆకట్టుకుంటోంది.. కట్టి పడేస్తోంది. తెలుగులో ఆరు సీజన్లు సక్సెస్ ఫుల్‌గా ముగిశాయి. తొలి రెండు సీజన్లకు జూనియర్ ఎన్టీఆర్, నాని హోస్ట్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున- నాన్ స్టాప్‌గా అన్ని సీజన్లనూ హోస్ట్ చేస్తూ వస్తోన్నారు.

Bigg Boss OTT 2

తెలుగులో ఇక ఏడో సీజన్ కోసం కసరత్తు సాగిస్తోన్నారు నిర్వాహకులు. ఈ ఏడాది జులై/సెప్టెంబర్‌లల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. 24 గంటల పాటు ప్రసారం అయ్యేలా బిగ్ బాస్ ఓటీటీని తెలుగు ప్రేక్షకులకూ పరిచయం చేశారు. దీనికి కూడా మాతృక నార్త్‌లోనే ఉంది. ప్రముఖ నటి బిందు మాధవి బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ 1 విజేతగా నిలిచారు.

బాలీవుడ్ దర్శకుడు కరణ్ జొహార్ బిగ్ బాస్ ఓటీటీ 1ను హోస్ట్ చేశారు. ఆ సీజన్ విన్నర్- దివ్య అగర్వాల్. సీజన్ 2 వచ్చేటప్పటికీ హోస్ట్ మారిపోయారు. కరణ్ జొహార్ స్థానంలో సల్మాన్ ఖాన్ ఎంట్రీ ఇచ్చారు. ఈ బిగ్ బాస్ సీజన్ 2 త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీనికి సంబంధించిన తేదీని కొద్దిసేపటి కిందటే నిర్వాహకులు ప్రకటించారు.

Bigg Boss OTT 2

ఈ నెల 17వ తేదీన బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 ప్రసారమౌతుందని తెలిపారు. జియో సినిమా దీన్ని ప్రసారం చేయనుంది. దీనికి సంబంధించిన ప్రొమో విడుదలైంది. ఈ సీజన్ కంటెస్టెంట్స్ ఎవరనేది మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు గానీ కొన్ని పేర్లు మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ షోలో మొత్తం 12 మంది కంటెస్టెంట్స్ పోటీ పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సంభావన సేథ్, పూజా గోర్, అంజలి అరోరా, జియా శంకర్, పూనం పాండే, రాజీవ్ సేన్, జియాద్ దర్బార్, మునావర్ ఫారూఖీ, ఫహ్మాన్ ఖాన్, ఆదిత్య నారాయణ్, ఫైజల్ షేక్, అవేజ్ దర్బార్.. ఈ ఓటీటీ సెకెండ్ సీజన్ టైటిల్ కోసం పోటీ పడొచ్చని తెలుస్తోంది. కంటెస్టెంట్లు ఎంతమంది? వారెవరనేది అధికారికంగా ఈ నెల 17వ తేదీన రివీల్ అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+